Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

సాహసం చేస్తున్న పవన్ కళ్యాణ్-Pawan Kalyan To Sport Salt And Pepper Look In His Next

ముఖానికి రంగు వేసుకోవడం అనేది నాటకల కాలంలోనే ఉంది. ఇక సినిమాలు వచ్చాక దీన్నే మేకప్ అని అనడం మొదలుపెట్టారు. మేకప్ లేకుండా మన సినిమా తారలు నటించడం చాలా కష్టం. మనకి వాళ్ళకి ఉన్న తేడా అదేగా. ముఖానికి కప్పుకున్న అందాన్నీ తీసేస్తే వాళ్ళు మనలాంటి మనుషులే.

వయసు మళ్ళిన హీరోలు కూడా యవ్వనంగా కనిపించం వేనుక ఉన్న రహస్యమే మేకప్. ఇప్పుడున్న కథానాయకులలో కేవలం తమిళ నటుడు అజిత్ మాత్రమే మేకప్ కి పెద్దగా ప్రాధాన్యమివ్వడు. జుట్టుకి రంగువేసుకోవడం, తలకి విగ్ పెట్టుకోవడం లాంటివి చేయడు అజిత్. ఇంకోరకంగా చెప్పాలంటే తన వయస్సు స్క్రీన్ పై దాచుకోడు.

ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అజిత్ ని ఫాలో అవనున్నాడు. అజిత్ మాదిరే, తన తదుపరి చిత్రంలో జుట్టుకి రంగు వేసుకోకుండా కనిపించనున్నాడని సమాచారం.

ఎస్ జే సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పవన్ ఫాక్షన్ లీడర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. పాత్రకు తగ్గట్టే, నాలుగుపదులు దాటినవాడిలా కనిపించడం కోసం పవన్ మేకప్ పెద్దగా వాడకుండా, తెల్ల జుట్టు, తెల్ల గడ్డంతోనే అలరిస్తాడని టాక్. ఇది నిజంగా పెద్ద సాహసమే.

Continue Reading
More Posts
To Top