డాలీతో మరోసారి పవన్‌

పవన్‌ కళ్యాణ్‌కు ఎవరు వెంటనే నచ్చరు.కాని ఎవరైనా నచ్చారంటే ఆ వ్యక్తిని ఎంతగా అభిమానిస్తాడో గతంలో పలు సార్లు, పలు సందర్బాల్లో తెలిసింది.

 Pawan Kalyan Promises To Director Dolly-TeluguStop.com

తాజాగా పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘గోపాల గోపాల’ సినిమాకు కిషోర్‌ పార్థసాని(డాలీ) దర్శకత్వం వహించిన విషయం తెల్సిందే.ఆ సినిమాను డాలీ తెరకెక్కించిన తీరు పవన్‌కు బాగా నచ్చడంతో మరోసారి ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకుంటున్నట్లుగా సభాముఖంగా తెలియజేశాడు.

మరోసారి డాలీతో కలిసి పని చేస్తానంటూ ‘గోపాల గోపాల’ ఆడియో వేడుక సందర్బంగా పవన్‌ చెప్పుకొచ్చాడు.

‘గోపాల గోపాల’ సినిమా విడుదల కాగానే ‘గబ్బర్‌సింగ్‌`2’ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ నటించనున్నాడు.

ఆ తర్వాత మాటల మాంత్రికుడు మరియు తన స్నేహితుడు అయిన త్రివిక్రమ్‌తో ఒక సినిమా చేసే అవకాశాలున్నాయి.ఆ తర్వాత డాలీ దర్శకత్వంలో పవన్‌ నటిస్తాడేమో చూడాలి.

మరోసారి డాలీ దర్శకత్వంలో పవన్‌ నటిస్తే, డాలీ కెరీర్‌ టర్న్‌ అయిపోయినట్లే అని విశ్లేషకులు అంటున్నారు.ఇప్పటికే స్టార్‌ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న డాలీ ఇక పవన్‌తో రెండవ సినిమా కూడా చేసే స్టార్‌ దర్శకుల జాబితాలో ముందు వరుసలో ఉంటాడు.

మరి డాలీకి ఆ అవకాశం ఎప్పుడు వచ్చేనో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube