Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

పవన్‌ కళ్యాణ్‌ మరో పెళ్లి??-Pawan Kalyan Married 4th Time..?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే మూడు పెళ్లిలు చేసుకున్న విషయం తెల్సిందే. మొదట నందినిని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చిన పవన్‌ ఆ తర్వాత రేణు దేశాయ్‌తో చాలా కాలం పాటు సహజీవనం చేశాడు. ఒక కొడుకు కూడా పుట్టిన తర్వాత రేణుదేశాయ్‌ను పవన్‌ వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వీరిద్దరికి పాప జన్మించింది. అయితే ఏం జరిగిందో ఏమో కాని పవన్‌ ఆ మద్య రేణుదేశాయ్‌కు విడాకులు ఇచ్చి అన్నా లెగ్జినేవానే ఫారినర్‌ను పెళ్లి చేసుకున్నాడు. తాజాగా పవన్‌ మరో పెళ్లి చేసుకున్నాడు అనే పుకార్లు షికారు చేస్తున్నారు.

‘గబ్బర్‌సింగ్‌`2’లో హీరోయిన్‌గా ఎంపిక అయిన అనీష ఆంబ్రోస్‌ను పవన్‌ పెళ్లి చేసుకున్నాడు అంటూ కొంత మంది సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందనే విషయాన్ని పక్కన పెట్టి సాధారణ ప్రేక్షకులు కూడా ఇదే నిజం అని నమ్ముతున్నారు. ఈ పెళ్లి వార్తను పవన్‌ కళ్యాణ్‌ యాంటీ ఫ్యాన్స్‌ స్ప్రెడ్‌ చేస్తున్నారు. ఇలాంటి వార్తలను పుట్టించే వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ పవన్‌ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ‘గబ్బర్‌సింగ్‌`2’ మూవీ ఈనెలాఖరున ప్రారంభం కానున్న విషయం తెల్సిందే.

Continue Reading
To Top