ఆ రెండు నియోజకవర్గాలపై కన్నేసిన పవన్

జనసేన అధ్యక్షుడు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాను.రెండు తెలుగు రాష్ట్రాలలో మా పార్టీ తరుపున అభ్యర్ధులు నిలబడుతారు అని వెల్లడించిన విషయం అందరికీ తెలిసినదే.

 Pawan Kalyan  Looking Into West Godavari Constituency’s-TeluguStop.com

అంతేకాదు వచ్చే ఎన్నికల్లో అనంతపురం వైపు నుంచీ పోటీ చేస్తాను అని ప్రకటన కూడా చేసేశారు.ఇది ఇలా ఉంటే జనసేన పోరు ఒంటరిగానే ఉంటుందా లేక వేరే పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు.

పవన్ అనంతపురం నుంచీ పోటీ చేస్తాను అని ప్రకటించడంతో పవన్ అనతపురం అర్బన్.గుతకల్లు ,కదిరినుంచీ పోటీ చేస్తారు అని ఎవరికీ వారు ఎవరి ఉహలకి తగ్గట్టుగా చెప్పేశారు

పవన్ పరకతనతో మీడియా వాళ్లు వార్త‌లు కూడా అనేక ఉహాగానాలు రాసేశారు.

ప‌వ‌న్ అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌న్న ప్ర‌క‌ట‌న‌తో ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల పేర్లు ప్ర‌ధానంగా తెర‌మీద‌కు వ‌చ్చాయి.ఈ విషయం సోషల్ మీడియాలో రాజకీయ వర్గాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

పవన్ కూడా ఈ విషయాన్ని ఖండించకపోవడం తో అందరు నిజమే అనుకున్నారు కానీ ఇప్పుడు ప‌వ‌న్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంపై మ‌రో టాక్ న‌డుస్తోంది.అదేమిటంటే

పవన్ కళ్యాణ్ తన సొంత జిల్లా నుంచీ పోటీ చేస్తారు అనేది టాక్.

పవన్ కళ్యాణ్ కి ఎంతో బలం ఉన్న తన సొంత జిల్లా పాలకొల్లు,నరసాపురం నుంచీ కాకుండా వేరే చోటనుంచీ పోటీ చేయదు అని తెలుస్తోంది.ఇదే విషయం జనసేన వర్గాల్లో జోరుగా సాగుతోంది.

తన వర్గం కాపులు.పవన్ ని అభిమానించే బీసీ వర్గం అయిన శెట్టిబ‌లిజ‌ కూడా ఇక్కడ ఎక్కువ వీరి ఓటింగ్ నిర్ణయంతోనే ఇక్కడ గెలిపు ఓటములు ఆధారపడి ఉంటాయి.

ఇవే ఇక్కడ పవన్ కి కలిసొచ్చే అంశాలు.పవన్ కూడా ఇక్కడ నుంచీ పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారు.

కారణం ఏమిటంటే ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌వ‌న్ సొంత నియోజ‌క‌వ‌ర్గం న‌ర‌సాపురం కాగా, పక్క‌నే ఉన్న పాల‌కొల్లులో చిరు గ‌తంలో పోటీ ఓడిపోయారు.దీంతో ప‌వ‌న్ ఇప్పుడు ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచి స‌త్తా చాటాల‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది

ప‌వ‌న్ ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ చేస్తాడా లేదా రెండు నియోజ‌క‌వ‌ర్గాలు ఎంచుకుంటాడా, అన్న‌ది కూడా క్లారిటీ లేదు.

తన అన్నయ్య కూడా రెండు నియోజకవర్గాలలో పోటీ చేశాడు.అలాగే పవన్ కూడా సొంత జిల్లా నుంచీ పోటీ చేస్తూ.

అనతపురం మీద కూడా పోటీచేస్తాడు అనే టాక్ ఉంది.అయితే జగన్ కి సేనియర్లు ఇస్తున్న సలహా ఏమిటంటే పవన్ తన సొంత జుల్లా అయిన పశ్చిమ నుంచీ పోటీ చేయడమే మంచిది అని సూచిస్తున్నారు.

పవన్ మాత్రం ఈ విషయంలో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ కి రాలేదని తెలుస్తోంది.మరి పవన్ చూపు ఏ నియోజకవర్గం వైపు పడుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube