జ‌న‌సేన‌ను ముంచుతోన్న ప‌వ‌న్ కోట‌రీ

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ 2019 ఎన్నిక‌ల్లో ఏపీ, తెలంగాణ‌లో పోటీకి రెడీ అవుతున్నాడు.అవినీతి మ‌ర‌క‌లేని యువ‌కుల‌కు, సీనియ‌ర్ల‌కు టిక్కెట్లు ఇవ్వాల‌న్న‌ది ప‌వ‌న్ డెసిష‌న్‌.

 Pawan Kalyan Kotary Effect On Jana Sena-TeluguStop.com

ఈ క్ర‌మంలోనే ఏపీలోని వివిధ స‌మ‌స్య‌ల‌ను టార్గెట్ చేసిన ప‌వ‌న్ వాటిపై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తూ ఇప్పుడిప్పుడే రాజ‌కీయంగా స్ట్రాంగ్ పునాదులు వేసుకుంటున్నాడు.

ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది.

మ‌హా అయితే ప‌వ‌న్ నాలుగైదు స‌మ‌స్య‌ల మీద మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు స్పందించాడు.మరి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా స‌మ‌స్య‌లు లేవా ? వాటిపై ప‌వ‌న్ ఎందుకు స్పందించ‌డం లేదు ? క‌నీసం ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌వ‌న్‌కు తెలిపేందుకు వెళుతున్న వారికి కూడా జ‌న‌సేన ఆఫీస్‌లో అవ‌మానాలు, అసంతృప్తులు ఎదుర‌వుతున్నాయా ? అంటే విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అవున‌నే ఆన్స‌రే వ‌స్తోంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల చాలా స‌మ‌స్య‌ల‌తో ప్ర‌జ‌లు బాధ‌లు ప‌డుతున్నారు.ఈ క్ర‌మంలోనే ప్ర‌శ్నిస్తానంటోన్న ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు చాలా మంది త‌మ ఊళ్ల నుంచి వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కోర్చి మ‌రీ హైద‌రాబాద్‌లోని జ‌న‌సేన ఆఫీస్‌కు చేరుకుంటున్నారు.

అయితే అక్క‌డ ప‌వ‌న్ ఎలాగూ ఉండ‌రు.క‌నీసం ప‌వ‌న్ నియ‌మించిన బృందానికి అయినా త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకుందామంటే అసలు సంగ‌తేమోగాని.వారు వేసే స‌వాల‌క్ష ప్ర‌శ్న‌ల‌తో స‌మ‌స్య చెప్పుకునేందుకు వెళ్లిన వారు నానా హింస అనుభ‌విస్తున్నార‌ట‌.

వాస్త‌వానికి ఈ టీంను ఎక్క‌డైనా ఏ స‌మ‌స్య ఉన్నా, ఎవ‌రైనా త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌స్తే వారి స‌మ‌స్య నోట్ చేసుకునేందుకే నియ‌మించారు.

అయితే ప‌వ‌న్ కోట‌రీలో ఉండే ఓ ముగ్గురు మాత్రం బాధ‌ను చెప్పుకునేందుకు వెళ్లిన వారినే స‌వాల‌క్ష ప్ర‌శ్న‌ల‌తో విసిగించేస్తున్నార‌ట‌.దీనిపై ప‌వ‌న్ ఇప్పుడు స్పందించ‌రు ? తాము స్పందించాల్సిన‌ప్పుడు మాత్ర‌మే స్పందిస్తాం ? అన్న ఆన్స‌ర్ వీరి వ‌ద్ద నుంచి వ‌స్తోంద‌ట‌.

ఇక చాలా స‌మ‌స్య‌ల‌ను ప‌వ‌న్ వ‌ర‌కు వెళ్ల‌కుండా ఈ కోట‌రీయే అడ్డుకుంటోంద‌న్న టాక్ కూడా అప్పుడే స్ప్రెడ్ అవుతోంది.ప‌వ‌న్ ఈ కోట‌రీ ఏం చేస్తుందో ? ఓ క‌న్నేయ‌క‌పోతే జ‌న‌సేన నిండా మున‌గ‌డం ఖాయ‌మ‌న్న టాక్ వ‌చ్చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube