కొంచెం నడి వయసుకి రాగానే మగవారు జుట్టు రాలడం అనే సమస్యని ఎదుర్కొంటారు.ఇది సహజమే.
జుట్టు ఊడటం, బట్ట తల రావడం, లేదంటే వెంట్రుకలని సరిగా దువ్వలేనంతగా రాలడం జరుగుతాయి.ఈ సమస్యలతో తెలుగు హీరోలు కూడా బాధపడుతున్నారు.
ఇప్పుడు మన తెలుగు హీరోల్లో విగ్ తో నెట్టుకొస్తున్నవారు లేకపోలేదు కదా.ఆ విగ్ హీరోల లిస్టులో పవన్ కళ్యాణ్ కూడా చేరినట్లు చెబుతున్నారు ఫిలింనగర్ జనాలు.
మీరే చూడండి, ఈమధ్యకాలంలో పవన్ ప్రైవేట్ ఫంక్షన్స్ లో ఎలా ఉన్నారో, కాటమరాయుడు స్టిల్స్ లో ఎలా ఉన్నారో.ఆయన్ని, ఆయన డ్రెస్సింగ్ ని కాదు, ఆయన తలని, ఆయన హేయిర్ స్టయిల్ ని గమనించండి, తేడాగా అనిపించట్లేదా? ఈ ఫోటోలలో తేడాలు చూస్తోంటే పవన్ కాటమరాయుడు సినిమాలో విగ్ వాడుతున్నట్లు కనిపించట్లేదా?
వాడితే మాత్రం తప్పు ఏముంది ? కొందరు సీనియర్ హీరోలు కూడా వాడుతున్నారుగా అని అంటున్నారా? తప్పు అని అనట్లేదు .ఏదో గమనించాం కాబట్టి చెబుతున్నాం.సినిమా హీరో అయితే మాత్రం, వాళ్ళది మాత్రం మనిషి శరీరం కాదా? వారికి సమస్యలు ఉండవా? ఇక కాటమరాయుడు గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 18న జరగనుందట.అదేరోజు ట్రైలర్ కూడా విడుదల చేస్తారు.సినిమా మార్చి 24వ తేదిన ప్రేక్షకుల ముందుకి వస్తుంది.