పవన్ కళ్యాణ్ బాహుబలి .. చిరంజీవి భల్లాలదేవుడు

“వీ వాంట్ పవర్ స్టార్ .వీ వాంట్ పవర్ స్టార్” ప్రతి మెగా ఫ్యామిలి ఫంక్షన్ లో ఈ నినాదాలు విన్నాం.

 Pawan Kalyan Is Baahubali And Chiranjeevi Is Bhallala Deva ?-TeluguStop.com

ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ రాకపోవడం, కాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి పవర్ స్టార్ అంటూ గోలగోల చేయడం, ఎన్నిసార్లు చూసాం ఈ తంతు.నాగాబాబు గట్టిగా కడిగేసిన వినలేదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

అది ఆడియో ఫంక్షన్ అయినా, చిరంజీవి సన్మాన సభ అయినా, సమయం-సందర్భం లేకుండా గోల చేసారు అభిమానులు.చివరకి బాహుబలి మొదటి భాగం ఆడియో ఫంక్షన్ లో కూడా పవర్ స్టార్ అబిమానులు, అల్లరిమూకలు ఇదే అని చేసారు.

ఓ మెగా ఫంక్షన్ లో ప్రభాస్ ని కూడా వదలలేదు.ఈ నినాదాలు పవర్ స్టార్ ఫ్యాన్స్ కి కిక్ ని ఇస్తాయేమో కాని స్టేజి మీద ఉన్నవారికి ఇబ్బందే కదా.

కాని ఈ నినాదాలే బాహుబలి-2 ఇంటర్వల్ సీన్ రాసుకోవడానికి స్పూర్తినిచ్చాయి అని కథా రచయిత విజయేంద్రప్రసాద్ అంటున్నారు.ఆ పవర్ స్టార్ నినాదాలే ఇంటర్వల్ లో బాహుబలి నినాదాలు రాసేలా చేశాయని నిన్న ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

వినడానికి బాగానే ఉంది కాని, ఓ పది రోజుల ముందు “పవన్ కళ్యాణ్ తన స్టోరిలు తానే రాసుకోకపోతే బాగుటుంది” అంటూ సర్దార్ గబ్బర్ సింగ్ ని ఇదే విజయేంద్ర ప్రసాద్ ఎద్దేవా చేసారు కదా, దాంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన మీద మాటల దాడి మొదలుపెట్టారు, దాన్ని కవర్ చేసుకునేందుకే మళ్ళీ ఈ కొత్త స్టేట్మెంట్ వదలలేదు కదా ?

ఎందుకంటే బాహుబలి 2 ఇంటర్వల్, బాహుబలి 1 ఇంటర్వల్ ఒకేరీతిలో ఉంటాయి.మొదటిభాగంలో విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంటే, ఇక్కడ పట్టాభిషేకం జరుగుతుంది.

అంతే తేడా … అక్కడా అవే బాహుబలి నినాదాలు, ఇక్కడ అవే బాహుబలి నినాదాలు.ఈ పవన్ కళ్యాణ్ టాపికే కొత్తగా వచ్చింది.

మరో విషయం ఏమిటంటే .బాహుబలి పవన్ కళ్యాణ్ అయితే, మరి స్టేజి మీద ఉన్న చిరంజీవి భల్లాలదేవుడా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube