పవన్ కళ్యాణ్ ని ఒక బ్రోకర్ ..అన్నాడు

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ పార్టీ రాజకీయ పార్టీగా రూపొంది.రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరగా ఎదురే లేకుండా కొనసాగుతోంది.

 Pawan Kalyan Is A Broker Says Pidamarthi Ravi-TeluguStop.com

సార్వత్రిక పార్టీలో ఎదురలేని ఈ కారు గ్రేటర్ ఎన్నికల్లో కూడా గెలుపొంది తమ జెండా ఎగరవేయాలనుకొంటున్నాయి.

తమ గెలుపుమీద నమ్మకంతో ఉన్న టీఆరెస్ పార్టీ తాజా పరిమాణాలతో ఆందోళన చెందుతోంది.

అందుకనే ఆయన గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తారనే వార్త వెలువడగానే ఆయనపై టీఆర్ఎస్ ఎదురు దాడి ప్రారంభించింది.ప్రచారానికి వస్తారో రారో తెలియని వ్యక్తిపై ముందుగానే మాటల దాడిని ప్రారంభించింది.

వివరాల్లోకి వెళ్తే…గత ఎన్నికల్లో జన సేన ఎక్కడా పోటీ చేయకపోయినా… బీజేపీ, టీడీపీ లను తన ప్రచారంతో సేఫ్ జోన్ లోకి తీసుకుని వెళ్లారు.యువతకు ఆయన పట్ల ఉన్న ఆదరణ, ఆయన ప్రసంగాల్లో ఉన్న పదును యువతను ఆకర్షిస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది.

అందుకనే పవన్ టార్గెట్ చేసి విమర్శిస్తూ నా కెందుకీ గొడవ.నేను పోటీ చేస్తున్నానా అనుకునేలా టీఆర్ఎస్ చేయాలని భావిస్తోంది.

దీంతో పవన్ పై విమర్శలు చేసి ఆయనకు ముందే కళ్ళెం వేయాలని ప్లాన్ చేస్తోంది.తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి పవన్ పై వ్యతిరేక దాడిని మొదలు పెట్టారు.

పవన్ ది పవనిజమ్ కాదు బ్రోకరిజయం అని వ్యాఖ్యానించారు, రాజకీయాల్లో పవన్ ఒక బ్రోకర్ అని ఆయన మండి పడ్డారు/.ఆయన పవనిజం తెలంగాణాలో పని చేయదని హెచ్చరించారు.

తెలంగాణ ప్రజలు సినిమాలు చూస్తేనే హీరోగా ఎదిగావు.కనుక ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చి ఆడియన్స్ ను పోగొట్టుకోవద్దు అని అర్ధం వచ్చేలా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

కాగా ఈ హెచ్చరికలపై టీడీపీ నేతలు పవన్ ఎన్నికల ప్రచారానికి వస్తారంటేనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు….మరి పవన్ నిజంగా ఎన్నికల ప్రచారానికి వస్తే ఆ కిక్కే వేరబ్బా.

అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube