ఎన్టీఆర్ బర్త్ డే పార్టీలో పవన్ కళ్యాణ్ కి అవమానం

సర్దార్ గబ్బర్ సింగ్ కథని పవన్ కళ్యాణ్ రెండేళ్ళు కష్టపడి రాసానని చెప్పడం మీరు వినే ఉంటారు.సినిమా చూసిన తరువాత అంతా పవన్ కళ్యాణ్ మీదే విమర్శలు ఎక్కుపెట్టారు.

 Pawan Kalyan Insulted In Ntr’s Birthday Party-TeluguStop.com

కారణం, ఆ సినిమా కథ ఎవరికి నచ్చకపోవడం.అలాంటి నాసికరం కథని రెండేళ్ళ రాసానని పవర్ స్టార్ చెప్పడం.

ఇదంతా ఒక ఎత్తైతే, ఆ సినిమాకి బాబి కేవలం పేరుకే దర్శకుడు తప్ప, సినిమాని దగ్గరుండి తీసింది లేదా తీయించింది పవన్ కళ్యాణే అని విమర్శలు ఉన్నాయి.ఆ సినిమా క్రెడిట్ పూర్తిగా పవన్ ది కాబట్టే, డిజాస్టర్ అయినా ఎన్టీఆర్ బాబికి అవకాశమిచ్చాడని చెబుతారు.

ఇదంతా నిజమేనేమో అని బాబి చేసిన కామెంట్లు వింటే అర్థమవుతోంది.

విషయం ఏమిటంటే మొన్న ఎన్టీఆర్ పుట్టినరోజు కదా.అభిమానుల రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.కొంతమంది జై లవ కుశ టీమ్ తో కలిసి సంబరాలు చేసుకునేందుకు వెళ్ళారు.

వారితో పాటు డైరెక్టర్ బాబి బర్త్ డే పార్టీలో పాల్గొన్నారు.మైక్ అందుకున్న బాబి ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ మధ్యలో “నవ్వుకుంటూ సెట్ కి వచ్చి ఆయన (ఎన్టీఆర్) పని ఆయన చేసుకుంటారు తప్ప “మిగితా వారిలో వేలుపెట్టడం కాని చూడ్డం కాని ఉండదు” అంటూ కామెంట్ వదిలారు.

ఈ వ్యాఖ్య చూస్తోంటే, బాబి టార్గేట్ చేసింది పవన్ కళ్యాణ్ ని అని చిన్నపిల్లాడికి కూడా తెలిసిపోతుంది.మరి ఇంత ముక్కుసూటిగా బాబి పవన్ మీద కామెంట్ చేయడం నిజంగా ఎవరు ఊహించనిదే.

ఈ కామెంట్ పై ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు నిప్పులు చెరుగుతోంటే, పవన్ ఇంకా స్పందించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube