పవన్‌ కళ్యాణ్ నేరం చేస్తాడా?

టాలీవుడ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ తాజాగా ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు నిర్మాణంలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.ఇటీవలే ఈ విషయాన్ని దాసరి వర్గాల వారు అధికారికంగా ప్రకటించారు.

 Pawan Kalyan In Tamil Movie Neram Remake-TeluguStop.com

అయితే ఈ నేపథ్యంలో పవన్‌ కోసం దర్శకుడిని మరియు కథను ఎంపిక చేసే పనిలో దాసరి తలమునకలై ఉన్నట్లుగా తెలుస్తోంది.మొదట దాసరి దర్శకత్వం వహించాలని భావించినప్పటికి, కొన్ని కారణాల వల్ల ఆలోచనను విరమించుకున్నట్లుగా తెలుస్తోంది.

తాజాగా దాసరి, పవన్‌ సినిమా గురించి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికర చర్చ జరుగుతోంది.

తమిళంలో సూపర్‌ హిట్‌ అయిన ‘నేరం’ సినిమాను దాసరి రీమేక్‌ చేయాలని చాలా కాలం క్రితమే రీమేక్‌ రైట్స్‌ తీసుకోవడం జరిగింది.

మంచు విష్ణుతో ‘నేరం’ రీమేక్‌ చేయాలని భావించాడు.కాని కొన్ని కారణాల వల్ల విష్ణుతో ఆ రీమేక్‌ను చేయలేదు.

తాజాగా ‘నేరం’ సినిమా స్క్రిప్ట్‌ను పవన్‌కు వినిపించారని, ఆ కథ పవన్‌కు బాగా నచ్చిందని తెలుస్తోంది.తమిళ రీమేక్‌లో పవన్‌ నటించేందుకు సూచన ప్రాయంగా ఒప్పుకున్నాడని అంటున్నారు.

త్వరలోనే ఈ విషయం గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు.‘నేరం’ సినిమా రీమేక్‌ చేస్తే దానికి దర్శకత్వం ఎవరు చేస్తారు అనే ఆసక్తికర ప్రశ్న ప్రేక్షకుల్లో వస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube