దక్షిణ భారతీయులంతా నలుపు అనడం పై పవన్ కళ్యాణ్ గరం గరం

కొద్దిరోజుల కిందట ఆఫ్రికాకు చెందిన ఓ నల్లజాతీయుడిపైన భారత రాజధాని డిల్లీలో జాతి వివక్ష దాడి జరిగన సంగతి గుర్తుకు ఉండే ఉంటుంది.ఈ దాడిపై కేవలం భారత మీడియాలోనే కాదు, అంతర్జాతీయ మీడియాలో కూడా చర్చలు జరిగాయి.

 Pawan Kalyan Hits Tarun Vijay For His Racist Comments On South Indians-TeluguStop.com

ఊహించని విధంగా భారత్ లో కూడా జాతి వివక్ష దాడులు జరగడం సామాజిక వేత్తలను కలవరపరించింది.ఈ దాడులపై ఒక ఆఫ్రికన్ ఛానెల్ లో చర్చ జరుగుతుండగా, ఆ చర్చలో దాడిపై తమ అభిప్రాయాన్ని విడియో కాల్ ద్వారా తెలిపారు భాజపా అనుబంధ రచయిత, నాయకుడు తరుణ్ విజయ్.

ఈ కార్యక్రమంలో ఆయన భావ వ్యక్తీకరణ పట్ల దక్షిణాది రాష్ట్రాలు మండిపడుతున్నాయి

అందుకు కారణం .తరుణ్ విజయ్ ఇలా మాట్లాడమే .“ఒకవేళ మేము (భారతీయులం) జాత్యహంకారులమైతే, జాతి వివక్ష ఉండుంటే, మేము దక్షిణ భారతీయులతో కలిసి ఎలా ఉంటున్నాం.మాలోనే నల్లవారు ఉన్నారు”.

ఈ వాఖ్యలపై దేశమంతట పెద్ద దుమారమే రేగుతోంది.తరుణ్ విజయ్ వాఖ్యలను ఖండిస్తూ, పవన్ కళ్యాణ్ కూడా జనాలతో తన గొంతు కలిపారు

“నల్లగా ఉన్న దక్షిణ భారతీయలు ఇచ్చే రెవెన్యూ కావాలి మీకు.

కాని వాళ్ళ మీద చిన్నచూపు మీకు.ఈ రకమైన భావజాలం ఉన్న వ్యక్తులు, అలాంటి వారికి చోటు ఇచ్చే పార్టీలు (బిజెపి) జాతీయ స్థాయిలో ఉండటం మన దౌర్భాగ్యం.

నల్లగా ఉన్నవి వద్దు అనుకుంటే కోకిలని నిషేధించండి.మీరు ఎగరేసే జాతీయ పతాకం ఒక దక్షిణాది మాహనీయుడి రూపకల్పనే.

ఉత్తరాది అహంకారం మొత్తం మీ మాటల్లోనే కనిపిస్తోంది.క్షమాపణలు అడిగినంత మాత్రానా మరిచిపోయే అవమానం కాదు ఇది.ఇలాంటి వివక్షలు జాతిని గీత గీసి మరీ విడదీస్తాయి” అంటూ జనసేన అధినేత ట్విట్టర్ ద్వారా తరుణ్ విజయ్ వాఖ్యాలను ఖండించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube