పవన్ కళ్యాణ్ కు హెడేక్ గా మారిన శృతి..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న డాలి సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ను సెలెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.అసలు ఎవరెవరినో హీరోయిన్ గా అనుకోగా ఫైనల్ గా శృతి ఫిక్స్ అయ్యింది.

 Pawan Kalyan Headache About Sruthi Hasan-TeluguStop.com

ఇప్పటికే పవన్ లేకుండా ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ తో కొన్ని సీన్స్ షూటింగ్ జరుపుకుంటుంది.అయితే ఇప్పుడు శృతి హాసన్ డేట్స్ విషయంలో చిక్కులొచ్చి పడ్డాయట.

డాలి అడిగిన డేట్స్ లేవంటూ శృతి చెప్పడం పవన్ కు తలనొప్పిగా మారింది.

ఓ సినిమా కోసం డేట్స్ ఇవ్వడం అది కాస్త లేట్ అవుతుందని ఆ డేట్స్ వేరే వారికి అడ్జెస్ట్ చేయడం హీరోయిన్స్ కు అలవాటే.

ఇక శృతి విషయంలో ఈ డేట్స్ గోల ఎప్పటినుండో ఉన్నదే.మరి తెలుగు సినిమాలు చేసే తీరిక లేనప్పుడు అసలు కమిట్ అవ్వడం ఎందుకు ఇలా హ్యాండ్ ఇవ్వడం ఎందుకు అని చెవులు కొరుక్కుంటున్నారు సిని జనాలు.

హీరోయిన్ తో చేయాల్సిన షూట్ కాస్త ఆమె రాకుండా ఉండటంతో ప్రొడక్షన్ వేస్ట్ అవుతుందట.మరి సాధారణంగా పవన్ సినిమాలకు ఆటంకాలెక్కువే అవన్ని దాటుకుని ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి.

అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తుండటం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube