జ‌న‌సేన‌పై ప‌వ‌న్‌కే డౌట్ కొడుతోందా..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ – చంద్ర‌బాబుతో భేటీ అవుతున్నార‌న్న తాజా వార్త ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది.గత ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును సీఎం చేయాల‌ని కాలికి బ‌లపం క‌ట్టుకుని ప్రచారం చేసిన ప‌వ‌న్ ఆ త‌ర్వాత చంద్ర‌బాబు, బీజేపీపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చేశారు.

 Pawan Kalyan Doubt On Janasena Over Winning-TeluguStop.com

ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రంలో బీజేపీ, ఏపీలో టీడీపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయ‌ని ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.ఏపీకి కేంద్రం ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు.

జిల్లాల వారీగా బహిరంగ సభలను పెట్టి ప్రత్యేక హోదా ఆవశ్యకతను గురించి పవన్ వివరించారు.

ఇక ఆ త‌ర్వాత స‌భ‌ల్లో ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఒంట‌రిగా పోటీ చేస్తుంద‌ని, తాను అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాన‌ని గ‌ట్టిగా చెప్పారు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేస్తే ఏపీలో టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన మ‌ధ్య ట్ర‌యాంగిల్ ఫైట్ త‌ప్ప‌ద‌ని అంద‌రూ అనుకుంటున్నారు.అయితే ప‌వ‌న్ సీరియ‌స్‌గా రాజ‌కీయాల్లో ప‌నిచేస్తున్న‌ట్టు క‌న‌ప‌డ‌డం లేదు.

ఓ వైపు వ‌రుస‌గా సినిమాల్లో బిజీగా ఉంటోన్న ప‌వ‌న్ రాజ‌కీయాలు, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే స్పందిస్తున్నాడు.ఇక కొద్ది రోజుల క్రింద‌టి వ‌ర‌కు చంద్ర‌బాబుపై సైతం మెత్త‌ని విమ‌ర్శ‌లు చేసిన ప‌వ‌న్ ఇప్పుడు అదే చంద్ర‌బాబుతో మీట్ అవ్వ‌డం స‌హ‌జంగానే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ప‌వ‌న్‌కు జ‌న‌సేన మీద స్ట్రాంగ్ న‌మ్మ‌కం లేదా ? అన్న సందేహాలే ఇప్పుడు అంద‌రి మ‌దిని తొల‌చి వేస్తున్నాయి.2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకునే ప‌వ‌న్ .బాబుతో భేటీ అవుతున్నార‌ని తెలుస్తోంది.మ‌ళ్లీ క‌లిసి పోటీకి దిగేందుకే ప‌వ‌న్ రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే జ‌గ‌న్ పార్టీ నుంచి ప్ర‌శాంత్ కిషోర్ సూచ‌న‌ల‌తో పొత్తుకు ప్ర‌తిపాద‌న వ‌చ్చినా.అది గెలిచే అవ‌కాశాల‌కు దూరంగా ఉంద‌ని అందిన స‌మాచారంతో మ‌ళ్లీబాబుతోనే క‌లిసి న‌డ‌వాల‌ని జ‌న‌సేనాని డిసైట్ అయిన‌ట్టు కూడా జ‌న‌సేన వ‌ర్గాల నుంచే మ్యాట‌ర్ లీక్ అయ్యింది.

ఇక రాజ‌కీయాల్లో నిన్న తిట్టు కోవ‌డం…నేడు చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం మామూలే.అలాంట‌ప్పుడు మోడీని, బీజేపీని, టీడీపీని, టీడీపీ ఎంపీల‌ను విమ‌ర్శించిన ప‌వ‌న్ ఇప్పుడు వారితోనే న‌డ‌వాల‌నుకోవ‌డం పెద్ద ఆశ్చ‌ర్యం ఏమీ లేద‌ని కూడా రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇక ఒంట‌రిగా పోటీ చేసి చేతులు కాల్చుకునే రిస్క్ చేయ‌డం కంటే టీడీపీ వెళితేనే కాస్తో కూస్తో ఇక్క‌డ వేళ్లూనుకునే ఛాన్స్ ఉంద‌ని భావించే ప‌వ‌న్ బాబుతో వెళ్లే డెసిష‌న్ తీసుకున్న‌ట్టు కూడా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube