ఎన్టీఆర్‌, చిరుకు భిన్నంగా ప‌వ‌న్...!

ప్రజారాజ్యం స్థాపించినప్పుడు చిరంజీవి సినిమాలు ఆపేశారు.ఎన్టీఆర్ సైతం బొబ్బిలి పులి సినిమా చేసాక సినిమారంగానికి స్వస్తి చెప్పి పాలిటిక్స్ లో దిగి ప్రభంజనం సృష్టించారు.

 Pawan Kalyan Different Political Strategy-TeluguStop.com

కాని పవన్ దీనికి భిన్నంగా వరసగా సినిమాలు సైన్ చేస్తూనే మరో వైపు ఎన్నికలకు సై అనటంలో ఉన్న ఆంత‌ర్య‌మేమిటో ఫాన్స్ కి కూడా అర్థం కావటం లేద‌ట‌.ఒక పక్క సినిమాలు చేసుకుంటూ మరో పక్క జనసేన విషయాల్లో యాక్టివ్ గా ఉండటం పవన్ ని బాగా ఇబ్బంది పెడుతోంద‌ట‌.

అలా అని సినిమాలు మానేసి జనసేన వైపే తన దృష్టి పెట్టడం లేదు.అంటే పూర్తిగా సినిమాలు మానేసి ప్రజాసేవకు వస్తానని పవన్ ఇంకా చెప్పలేద‌ని అభిమానులు చెబుతున్నారు.

జ‌న‌సైన్యం ఇంకా సిద్ధం కాలేదు కానీ యుద్ధానికి సిద్ధ‌మ‌ని సంకేతాలు పంపుతున్నాడు! సంస్థాగ‌తంగా ఇంకా పార్టీ నిర్మాణం పూర్తి కాలేదు.కానీ ఎన్నిక‌ల్లో త‌ప్ప‌కుండా పోటీచేస్తాన‌ని స్ప‌ష్టంచేస్తున్నాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌! కానీ ప్రాక్టిక‌ల్‌గా ఆలోచిస్తే ఇందులో ఎన్నో లెక్క‌లు ఉన్నాయంటున్నారు.

అనంతపూర్ నియోజకవర్గం నుంచి జనసేన వర్కర్స్ రిక్రూట్మెంట్ మొదలు పెట్టారు.

దీని తర్వాత ప్రకాశం జిల్లా.

ఇలా రెండు నెలలకు ఒక్కో జిల్లా కవర్ చేసుకుంటూ పోతే ఎంపిక‌ల‌కే సుమారు రెండేళ్ల స‌మ‌యం ప‌డుతుంది.ఈలోగా ఎన్నిక‌లు కూడా వ‌చ్చేస్తాయని విశ్లేష‌కులు వివ‌రిస్తున్నారు.

అలాగే అభ్యర్థుల ఖరారు ఒక్క రోజులోనో, ఒక్క నెలలోనో జరిగే పని కాదు.

ఇక పార్టీని ప్రకటించినప్పటి నుంచి సందిగ్ధంలో ఉన్న పవన్.

ఈ మాత్రం అయినా ప్రచారంలో ఉంటున్నాడంటే అందుకు అభిమానులే కీల‌కం! పవన్ ని దేవుడిలా కొలుస్తూ.అతను ఏం చేసినా పల్లకి మోసే అభిమాన గణం కోట్లలో ఉండటం.

అందులోనూ అధికులు సోషల్ మీడియా లో బాగా యాక్టివ్ గా ఉండటం జనసేనకు బాగా కలిసి వస్తున్న విషయమ‌ని చెబుతున్నారు.మ‌రి ఎన్టీఆర్, చిరుల‌కు భిన్నంగా అటు సినిమాలు, ఇటు రాజ‌కీయాలు చేస్తూ.

ఎన్నిక‌లకు వెళ్ల‌గ‌ల‌రా? అని సందేహ‌ప‌డుతున్నారు.ప్రాక్టికల్ గా అలోచించడంలో అటు అధినేత ఇటు కార్యకర్తలు విఫలమ‌వుతున్నారని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube