” పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే డైరెక్టర్ ఎవరు అనేది సినిమా పూర్తి అయ్యేదాకా చెప్పలేము ” అంటూ ఒక జోక్ ప్రస్తుతం సోషల్ మీడియా లో నడుస్తోంది.ఎందుకంటే సంపత్ నందితో తీయాల్సిన సర్దార్ గబ్బర్ సింగ్ ని బాబీ తో తీసాడు కళ్యాణ్.
ఇప్పుడు ఎస్ జే సూర్య కి ఛాన్స్ ఇచ్చినట్టే ఇచ్చి డాలీ కి సినిమా అప్పజెప్పాడు కళ్యాణ్.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉంది స్క్రిప్ట్ సిద్దం చేస్తున్న డైరెక్టర్ డాలీ పవన్ కళ్యాణ్ ని ఈ సినిమాలో పూర్తి కొత్త గెటప్ లో చూపించాలి అని ఫిక్స్ అయిపోయాడు అంటున్నారు.
పవన్ కళ్యాణ్ తనకు తానుగా ముందు తగ్గే ఆలోచనలో ఉండగా వెయిట్ తగ్గడం తో పాటు కాస్త లుక్ కూడా మారుస్తా అంటున్నాడు డాలీ.పవన్ ని గోపాలా గోపాలా చూపించడం లో ఫ్రెష్ లుక్ గా చూపించిన పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో ఒక ఫాక్షనిస్ట్ గా కళ్యాణ్ ని చూపించడం కోసం బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడట.
ఈ గెటప్ కి సంబంధించి రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి.
కథ కథనం స్క్రీన్ ప్లే విషయం లో గోపాలా గోపాలా టైం లో చేసిన తప్పులు ఎక్కడా రిపీట్ కాకూడదు అనేది డాలీ మొదటి ప్రయారిటీ గా చెబుతున్నారు.
మేకింగ్ లో స్పెషల్ స్టైల్ ఉన్న డాలీపై… ఇప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ బాగానే హోప్స్ పెట్టుకుంటున్నారు.మరోవైపు ఈ మూవీకి మ్యూజిక్ ఇచ్చేందుకు గాను అనూప్ రూబెన్స్ కు అవకాశం దక్కింది.