మహేష్ - ఎన్టీఆర్ గొడవలో రికార్డులు ఎగరేసుకుపోతున్న పవన్

అనుకున్నదే జరుగుతోంది … దసరా బాక్సాఫీస్ సమరంలో గెలిచేదేవరో, ఓడేదెవరో సినిమా టాక్ ని బట్టి ఉంటుంది కాని, సినిమా విడుదలకి ముందే ఒకరి బిజినెస్ ని ఒకరు తినేస్తున్నారు మహేష్ బాబు – ఎన్టీఆర్.అసలే GST ప్రభావం వలన షేర్లు తగ్గుతున్నాయి.

 Pawan Kalyan Benefited From Mahesh – Ntr War-TeluguStop.com

ఇలాంటి సమయంలో, మహేష్ – ఎన్టీఆర్ కేవలం వారం గ్యాపులో స్పైడర్, జై లవ కుశతో వస్తున్నారు.ఇద్దరిలో ఎక్కువ ప్రెషర్ మహేష్ మీదే.

ఎలాగో ఎక్కువ థియేటర్లు దొరకవు.విడుదలైన మూడోవ రోజునే బాలయ్యబాబు పైసావసూల్ అంటూ వస్తున్నాడు.

దాంతో స్పైడర్ రెట్లు దారుణంగా తగ్గించేసారు.ఓవరాల్ గా బిజినెస్ నాన్ బాహుబలి రికార్డ్ అవుతుంది కాని, కేవలం తెలుగు రాష్ట్రాల వరకు తీసుకుంటే, తెలంగాణలో మినహా, ఎక్కడా కూడా ముందు అనుకున్న రేంజిలో బిజినెస్ జరిగేలా లేదు.

తమిళ్, హిందీ, మలయాళం వెర్షన్లు, భారి సాటిలైట్ రేట్లతో నిర్మాతకి మంచి బిజినెస్ అయితే దక్కుతోంది.కాని తెలుగు రాష్ట్రాల్లో రికార్డు మిస్ చేసుకుంటున్నాడు సూపర్ స్టార్.

మరోవైపు జై లవ కుశ స్పైడర్ కి వారం ముందే వస్తున్నా, ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో లేదు.వారం తరువాత స్పైడర్ ఉండటం వలన ఏమో, పంపిణిదారులు పెద్ద మొత్తాలు ఇవ్వట్లేదు.

వీరి బాక్సాఫీస్ గొడవలో ఉంటే, అక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం రికార్డులు ఎగరేసుకుపోతున్నాడు.ప్రస్తుతం ఉన్న ట్రేడ్ అంచనాల ప్రకారం, కేవలం ఆంధ్రప్రదేశ్ ని తీసుకుంటే, స్పైడర్ కి 35-36 కోట్ల ధర పలుకుతోంది, జై లవ కుశ 28 కోట్లకి అమ్ముడుపోయేలా ఉంది.

మరోవైపు పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ చిత్రం ఏకంగా 45 కోట్ల మార్కు దాటేలా కనిపిస్తోంది.చూడండి ఎంత పెద్ద తేడా ఉందో.

పవన్ రికార్డుకి మూడు కారణాలు ఉన్నాయి.ఒకటి స్వయంగా పవన్ కళ్యాణ్ అయితే, రెండు ఆ సినిమా పోటిలో విడుదల అయ్యేలా లేదు ఇక మూడోవ కారణం త్రివిక్రమ్ బ్రాండ్.

అలాంటి ఇమేజ్ తెలుగు రాష్ట్రాల్లో మురుగదాస్ కి కాని, బాబికి కాని లేదు.ఏదేమైనా, రికార్డు రికార్డే.

అంత భారి రెట్లకి అమ్ముతున్నారు అంటే సినిమా ఖచ్చితంగా సోలో విడుదల అయ్యే ఉంటుంది.అంటే సంక్రాంతి పోటిలో ఉండేది మహేష్ – రామ్ చరణ్ అన్నమాట.

పవన్ సినిమా ఈ ఏడాదే విడుదల అయ్యే అవకాశాలు ఈరకంగా పెరిగిపోయాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube