బీజేపీకి యాంటీగా ర‌జ‌నీ+ప‌వ‌న్ కూట‌మి

ద‌క్షిణాదిపై ప‌ట్టుసాధించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న క‌మ‌ల ద‌ళం గుండెళ్లో గుబులు పుట్టించే వార్త ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది.ద‌క్షిణాదిలో గ‌తంలో కర్నాట‌క‌లో ప్ర‌భుత్వం ఏర్పాటు చేసి త‌ర్వాత ప్ర‌తిప‌క్షానికి ప‌రిమిత‌మైన బీజేపీ తాజాగా ఏపీ, తెలంగాణ‌తో పాటు కేర‌ళ‌, త‌మిళ‌నాడులో సైతం పాగా వేసేందుకు ర‌క‌ర‌కాల వ్యూహాలు ప‌న్నుతోంది.

 Pawan Kalyan And Rajinikanth New Front-TeluguStop.com

తెలంగాణ‌లో ఎదిగేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోన్న బీజేపీ త‌మిళ‌నాడులో రాజ‌కీయ సంక్షోభాన్ని త‌న‌కు అనుకూలంగా మ‌ల‌చుకునేందుకు చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ద‌క్షిణాదిలో రెండు చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన అగ్ర‌హీరోలు బీజేపీకి యాంటీగా ఓ కొత్త ఫ్రంట్‌కు తెర‌లేప‌నున్నారా ? అంటే అవున‌న్న ఆన్స‌ర్ సౌత్ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది.త‌మిళ‌నాడులో నెల‌కొన్న రాజ‌కీయ సంక్షోభం దృష్ట్యా సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కొత్త పార్టీ పెట్ట‌డం ఖాయ‌మ‌న్న వార్త‌లో జోరందుకున్నాయి.అక్క‌డ వినిపిస్తోన్న టాక్ ప్ర‌కారం ర‌జ‌నీ బీజేపీతో జ‌ట్టుక‌ట్ట‌డ‌ని అంటున్నారు.

ఇక ఏపీ+తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీ చేయ‌డం ఖ‌రారైంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో స‌త్తా చాటాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు.

ఈ ఇద్ద‌రు అగ్ర‌హీరోల‌కు సౌత్‌లో అశేష సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు.అయితే ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల వ‌ర‌కు ఈ ఇద్ద‌రు హీరోలు జ‌ట్టుక‌ట్టే సూచ‌న‌లు ఉన్నాయ‌ని ఊహాగానాలు వ‌స్తున్నాయి.

వీరి మెయిన్ టార్గెట్ బీజేపీయే అని కూడా రాజ‌కీయ విశ్లేష‌కుల చ‌ర్చ‌లు చెపుతున్నాయి.

ఏపీ+తెలంగాణ‌లో 42, త‌మిళ‌నాడులో 39 మొత్తం ఈ మూడు రాష్ట్రాల్లో క‌లుపుకుంటే 81 ఎంపీ స్థానాలు ఉన్నాయి.

వీటిపై టార్గెట్ చేసి ఎక్కువ సీట్ల‌ను సాధించుకుంటే సౌత్‌లో బీజేపీ చాలా వ‌ర‌కు నిలువ‌రించ‌వ‌చ్చ‌న్న‌దే ఈ రెండు పార్టీల ప్లాన్‌గా తెలుస్తోంది.అయితే ఈ రెండు పార్టీల ప్లాన్ స‌క్సెస్ కావాలంటే ఇక్క‌డ బ‌లంగా ఉన్న అన్నాడీఎంకే, డీఎంకే, వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్ పార్టీల‌ను ఎదుర్కోవ‌డం అంత వీజీ కాదు.

మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో క‌బాలి+కాట‌మ‌రాయుడు కొత్త ఫ్రంట్ ఎలా ఏర్ప‌డుతుంది ? ఎంత వ‌ర‌కు సక్సెస్ అవుతుంది అన్న‌ది చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube