మన మెగాస్టార్ .. పవర్ స్టార్ కి లెక్కలు రావా?

లెక్కలు కరెక్టుగా వేసుకుంటే ఖైదీనం 150 మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో 150వ సినిమా కానే కాదు.ఆయన పోషించిన అతిథి పాత్రలు తీసేస్తే లెక్క ఇంకా 140 ల్లోనే ఉంటుంది.

 New Mathematics Introduced By Mega Brothers-TeluguStop.com

ఒకవేళ అతిథి పాత్రలు కలిపి మాట్లాడుకుంటే లెక్క ఖైదీ నం 150 కి ముందే 150 దాటేసింది.కాని ఇష్టం వచ్చిన లెక్క వేసుకుంటూ, కొన్ని అతిథి పాత్రలు కౌంట్ చేయకుండా వదిలేసి, కొన్నిటిని లెక్క వేసి ఆ సినిమాని కాస్త 150వ సినిమాగా మార్చేసారు.కారణం? పునరాగమనం కదా .150 అంటే ఓ మైలురాయి .వినడానికి బాగుంటుంది అని, హైప్ బాగా జనరేట్ అవుతుందని అలా చేసేసారు.

చిరంజీవి లెక్కలకి పూర్తి రివర్స్ లో పవన్ కళ్యాణ్ లెక్కలున్నాయి.

అన్నయ్య అతిథి పాత్రలు కొన్ని ఉంచి , కొన్ని తీసేస్తే, ఇప్పుడు తమ్ముడు కూడా ఓ మైలురాయి కోసం మరో కొత్త లెక్క వేసాడు.కాటమరాయుడు హీరోగా పవన్ కళ్యాణ్ కి 22వ సినిమా.

కాని ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న తదుపరి సినిమా 23వ సినిమాగా కాదు, 25వ సినిమాగా లెక్కవేస్తారట.ఇదేం లెక్క అని తికమకపడుతున్నారు కదా.

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మైలురాయి సినిమా అంటే హైప్ ఎక్కువ ఉంటుంది కదా.అందుకే దీన్ని 25వ సినిమాగా మార్చేసారు.శంకర్ దాదా జిందాబాద్ లో చేసిన చిన్న కామియోని, గోపాల గోపాలలో చేసిన పెద్ద అతిథి పాత్రని లెక్కల్లో కలిపేసారు.150 నంబర్ కోసం అన్నయ్య సినిమా సంఖ్యని కోస్తే, 25 నంబర్ కోసం తమ్ముడు సినిమాలు కలుపుకుంటున్నాడు.ఇవేం మెగా లెక్కలో అని సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube