టీఆర్ఎస్‌తో జ‌న‌సేన పొత్తు

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ సెల్ఫీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఈ సెల్ఫీపై స్పందిస్తూ.

 Jana Sena Aliance With Trs-TeluguStop.com

తానూ, కేటీఆర్ గ‌తంలో క‌లుసుకుని తాజా రాజ‌కీయ ప‌రిణామాలపై చ‌ర్చించామ‌న‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.ముఖ్యంగా 2019 ఎన్నిక‌ల్లో రెండు రాష్ట్రాల్లోనూ బ‌రిలోకి దిగుతాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌కటించిన నేప‌థ్యంలో ఇది మ‌రింత కీల‌కంగా మారింది.

ఇప్ప‌టినుంచే ప‌వ‌న్‌ను త‌మ వైపు తిప్పుకునే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమ‌లు చేస్తోందా అనే కోణంలో విశ్లేష‌కులు అనుమానిస్తున్నారు.ప‌వ‌న్‌కు ఏపీలో క‌న్నా తెలంగాణ‌లో అభిమానులు ఎక్కువ‌మంది ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ చ‌రిష్మా వాడుకోవాల‌ని టీఆర్ఎస్ భావిస్తోంద‌ని వారు విశ్లేషిస్తున్నారు.

ప‌వ‌న్ క‌ల్యాణ్ నటించిన కాట‌మ‌రాయుడు చిత్రాన్ని ఇటీవ‌ల మంత్రి కేటీఆర్ చూసి.

ప‌వ‌న్ న‌ట‌ను ప్ర‌శంసించారు.అలాగే చేనేత‌కు మంచి ప్రాచుర్యం క‌లిపించార‌ని ఆకాశానికి ఎత్తేశారు.

అంతేగాక ప‌వ‌న్‌తో సెల్ఫీ దిగి.ఆ ఆనందాన్ని అభిమానుల‌తో పంచుకున్నారు.

అయితే దీని వెనుక రాజ‌కీయ కోణం కూడా లేక‌పోలేదంటున్నారు! 2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ పోటీచేసినా.మొత్తం కాన్‌స‌న్‌ట్రేష‌న్ అంతా ఏపీపైనే ఉంటుందనేది విశ్లేష‌కుల అంచ‌నా! ఇక తెలంగాణ‌లో ప‌వ‌న్‌కు కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న త‌రుణంలో.

ఓట్లు చీలిపోయే అవ‌కాశం లేక‌పోలేదు.ఓట్లు చీల‌కుండా ఉండేందుకు గాను టీఆర్ఎస్ ఇప్ప‌టినుంచే వ్యూహాలు ర‌చిస్తోంది.

ఇందులో భాగంగా జ‌న‌సేన‌తో పొత్తుపై చర్చిస్తున్న‌ట్లు స‌మాచారం.పొత్తు ద్వారా కొన్ని సీట్లు జ‌న‌సేన‌కు స‌ర్దుబాటు చేస్తే.ఇక ప‌వ‌న్ ఓటు బ్యాంకు త‌మ వ‌ద్దే ఉంటుందనేది టీఆర్ఎస్ వ్యూహం! ఈ పొత్తు వ్య‌వ‌హారంలో కేటీఆర్ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నార‌ట‌.దీంతో ప‌వ‌న్‌ను బుట్ట‌లో వేసుకునేందుకు ఇప్ప‌టినుంచే ప‌క్కాగా కార్యాచ‌ర‌ణ అమ‌లు చేస్తున్నార‌ట‌.

ఇందులో భాగంగానే కాట‌మ‌రాయుడిని ఆకాశానికెత్తేసిన‌ట్లు విశ్లేషిస్తున్నారు.కాగా ప‌వ‌న్‌తో కేటీఆర్ సెల్ఫీపై తెలంగాణ వాదులు ఆగ్ర‌హం వ్య‌క్తంచేస్తున్నారు.

సోష‌ల్ మీడియా సాక్షిగా భ‌గ్గుమంటున్నారు.

తెలంగాణ వాదాన్ని అంతగా వ్యతిరేకించిన పవన్ కల్యాణ్ తో ఇలా సెల్ఫీలు దిగ‌డం స‌రికాద‌ని నెటిజ‌న్లు విమ‌ర్శిస్తున్నారు.

అయితే, కేటీఆర్ సెల్ఫీ దిగింది వేరే కార‌ణంతో అనేవారూ ఉన్నారు.కాట‌మ రాయుడు సినిమా ద్వారా చేనేత‌ల్ని బాగా ప్రోత్సహించారు పవన్.

ఎలాగూ కేటీఆర్ కూడా చేనేత మంత్రి కావ‌డంతో, ఇలా సెల్ఫీ దిగ‌డం త‌ప్పులేద‌ని కొంత‌మంది వాదిస్తున్నారు.ఈ సెల్ఫీ నేప‌థ్యంలో తెలంగాణ నెటిజ‌న్ల నుంచి వ్య‌క్త‌మౌతున్న అభిప్రాయాల్ని జ‌న‌సేన అధినేత గ‌మ‌నించాల‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube