మహేష్ చేసేదంతా పబ్లిసిటి కోసమే అంటున్న పవన్ ఫ్యాన్స్

ప్రతి అభిప్రాయానికి రెండు రకాల రియాక్షన్స్ వస్తాయి.కొందరికి అది నచ్చుతుంది.

 Pawan Fans Argue That Mahesh Played Publicity Stunt With Jallikattu-TeluguStop.com

కొందరికి నచ్చదు.ఇప్పుడు మహేష్ కూడా ఓ అభిప్రయాన్ని వ్యక్తం చేసాడు.

ఈసారి అంతే .మహేష్ చేసిన కామెంట్స్ కొందరికి కరెక్టు అనిపిస్తే, మరికొంతమందికి తప్పుగా అనిపిస్తున్నాయి.ఇక్కడ టాపిక్ ఏంటి అనేగా మీ ప్రశ్న.జల్లికట్టు గురించి.

జల్లికట్టుని సపోర్ట్ చేస్తూ నిన్న మహేష్ బాబు నాలుగైదు పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.మహేష్ జల్లికట్టుని సపోర్ట్ చేయడంతో, తమిళ మీడియా, ఆహో మహేష్, ఓహో మహేష్ అంటూ తెగ సందడి చేస్తోంది.

మహేష్ ఆ ట్వీట్స్ పెట్టింది ఈ ఫలితం కోసమేనా? ఈ పబ్లిసిటి కోసమేనా? అవును, పబ్లిసిటి కోసమే అంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్.

మహేష్ తదుపరి చిత్రం తమిళనాడులో భారిస్థాయిలో విడుదల కానుంది కదా, ఆ సినిమాకి ఆదరణ పోగేసేందుకే మహేష్ ఇలా చేసాడని, మహేష్ కి నిజంగానే సమాజం మీద అంత ప్రేమ ఉంటే, పవన్ మాట్లాడినట్టు స్పెషల్ స్టేటస్ పై, తెలంగాణ – ఆంధ్ర ఉద్యమాలపై ఎందుకు స్పందించలేదు, ఇప్పుడు తమిళ ప్రేక్షకులు తన సినిమాకి అవసరం కాబట్టే ఇదంతా చేస్తున్నాడని వాదిస్తున్నారు పవన్ అభిమానులు.

ఇక మహేష్ ఫ్యాన్స్ జవాబు ఏంటంటే, మహేష్ చెన్నైలో పుట్టిపెరిగాడు, ఆ గడ్డ మీద మమకారం ఎందుకు ఉండదు, స్పెషల్ స్టేటస్ వంటి రాజకీయ ఆంశాలపై మహేష్ ఎందుకు స్పందిస్తాడు, జల్లికట్టు పార్టీలకి సంబంధించింది కాదు, సమాజం మీద ప్రేమ లేకపోతే, ప్రతి ఆపదలో తెలుగు రాష్ట్రలవారికి, తమిళనాడు వారికి డొనేషన్ ఎందుకు ఇస్తాడు, తన ఆదాయంలో 30% పేద చిన్నారులకి ఎందుకు వెళుతుంది, రెండు గ్రామాలని ఎందుకు దత్తత తీసుకున్నాడు అని ప్రశ్నిస్తున్నారు ప్రిన్స్‌ ఫ్యాన్స్.

ఎవరి వాదనలో న్యాయం ఉందో మీరే తేల్చుకోండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube