బాహుబ‌లిని మించిన ప‌వ‌న్ - త్రివిక్ర‌మ్ మూవీ ప్రి రిలీజ్ బిజినెస్‌

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమా అంటేనే ఇండ‌స్ట్రీలో ఎంత హైప్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.గ‌తంలో వీరి కాంబోలో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది సినిమాలు రెండూ సూప‌ర్ హిట్ అయ్యాయి.

 Pawan 25th Film Pe-release Business Crossed Movie-TeluguStop.com

ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి వీరి కాంబోలో తెర‌కెక్కుతోన్న సినిమాపై టాలీవుడ్ సినీజనాల‌తో పాటు ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ ఏపీ, తెలంగాణ వ‌ర‌కు అప్పుడే కంప్లీట్ అయిన‌ట్టు తెలుస్తోంది.

ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ విష‌యంలో తెలుగు సినిమా ఘ‌న‌త‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాటిన బాహుబ‌లి సినిమా ప్రి రిలీజ్ బిజినెస్‌నే క్రాస్ చేసేసింది.ఇది చాలా షాకింగ్‌గా ఉన్నా నిజ‌మే.

ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ సినిమాకు ఏపీ+తెలంగాణ‌ నుంచే థియేట్రికల్ రైట్స్ రూపంలో 94 కోట్లు స‌మ‌కూరాయ‌ట‌.ఇది బాహుబ‌లి 1 ప్రి రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ కాగా బాహుబ‌లి 2 కంటే త‌క్కువ‌.బాహుబ‌లి 2 రూ.130 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేస్తే, రెండో స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ మూవీ 94 కోట్ల బిజినెస్ చేసింది.

ఈ లెక్క‌న ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ మూవీ స‌గం కూడా షూటింగ్ కంప్లీట్ కాకుండానే ఈ రేంజ్‌లో బిజినెస్ చేసి అంద‌రి మైండ్ బ్లాక్ చేస్తోంది.బాహుబలి ది బిగినింగ్ 65.5 కోట్లు.ఖైదీ నంబర్ 150కి 62 కోట్లు కాటమరాయుడు 61.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో టాప్ 5లో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube