మరోసారి పటాస్ కాంబినేషన్..! -Pataas Combination Repeat Again 3 months

Ism Kalyan Ram Patas Combination Repeat Again Puri Jagannath Photo,Image,Pics-

కళ్యాణ్ రాం హీరోగా పటాస్ అంటూ ఓ రేంజ్లో పేలిన దర్శకుడు అనీల్ రావిపూడి. మొదటి సినిమాతోనే కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన లక్షణాలన్ని కనిపెట్టి హిట్ కొట్టిన ఈ దర్శకుడు రెండో సినిమా సుప్రీం కూడా హిట్ కొట్టాడు. ఓ సినిమా నందమూరి హీరో మరో సినిమా మెగా హీరో ఇలా మొదటి రెండు సినిమాలకే పెద్ద సినిమాలు చేసి వారెవా అనిపించుకున్న అనీల్ మూడో ప్రయత్నంగా రామ్ తో సినిమా చేయాల్సి ఉంది. ఏమైందో ఏమో కాని ఆ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది.

ఇక అందుకే మళ్లీ పటాస్ హీరోతోనే మరో సినిమాకు సిద్ధమవుతున్నాడట అనీల్. ప్రస్తుతం పూరి ఇజంతో పెద్ద హిట్ కే ప్లాన్ చేసిన కళ్యాణ్ రాం ఆ సినిమా తర్వాత కూడా సరైన సినిమా పడాలనే ఉద్దేశంతో అనీల్ రావిపూడికి కబురు పంపాడట. ఇక కళ్యాణ్ రాం కు సరిపోయే కథతో వచ్చిన అనీల్ సినిమా ఓకే చేసుకున్నారని ఫిల్మ్ నగర్ టాక్. సో పటాస్ కాంబినేషన్లో మరో సినిమా చూడబోతున్నాం అన్నమాట.

తీసిన రెండు సినిమాలు కమర్షియల్ హిట్లు కొట్టి క్రేజ్ సంపాదించిన అనీల్ రావిపూడి ఈ మూడో సినిమా కూడా అదే రేంజ్ హిట్ అందుకుంటే మాత్రం స్టార్ డైరక్టర్ గా పేరు తెచ్చుకునే అవకాశం ఉంది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. నాగార్జునకి చిన్నకోడలుతో కాదు, సమంతతో ఇబ్బంది

About This Post..మరోసారి పటాస్ కాంబినేషన్..!

This Post provides detail information about మరోసారి పటాస్ కాంబినేషన్..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Pataas Combination Repeat Again , Patas, Kalyan Ram, Anil Ravipudi, ISM, Puri Jagannath

Tagged with:Pataas Combination Repeat Again , Patas, Kalyan Ram, Anil Ravipudi, ISM, Puri JagannathAnil Ravipudi,ism,kalyan ram,Patas,Patas Combination Repeat Again,puri jagannath,,Sirivennala Mp3 Telugu