ఇది విన్నారా? హత్యకేసులో రామచిలుక సాక్ష్యం

రామచిలుకలు మాట్లాడతాయి అంటారు.నిజమే, ఇంట్లో రామచిలుకను పెంచుకోవాలే కాని, మనం మాట్లాడే మాటల్ని బాగా గమనించి చిన్ని చిన్ని పదాల నుంచి, కొన్ని మాటల వరకు బాగా నేర్చుకుంటాయి రామచిలుకలు.

 Parrot Becomes Witness In A Murder Case-TeluguStop.com

కేవలం మాటలవరకే పరిమితం కాకుండా, ఇప్పుడు కోర్టులో సాక్ష్యానికి కూడా పనికొచ్చేలా ఉంది ఒక రామచిలుక.

వివారాల్లోకి వెళితే, అది మిచిగన్ లోని సౌండ్ లేక్ పట్టణం.

గత ఏడాది మార్టిన్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు.భర్త శరీరంలోకి అయిదు బుల్లెట్లు దింపి భార్య గ్లెనా డురుమ్ ఈ హత్యకు పాల్పడినట్లుగా పోలీసులు మొదటినుంచి అనుమానించి అరెస్టు చేసారు.

గ్లెనాకు కూడా బుల్లెట్ గాయమవడం ఇక్కడ గమనించదగ్గ విషయం.

వారింట్లో పెంపుడు చిలుక మాటలు విని ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు పోలీసులు.

ఆ చిలుక పదే పదే “ఇంట్లోంచి బయటకి వెళ్లిపో, ఎక్కడికి వెళ్ళాలి, నన్ను కాల్చొద్దు” అనే అర్థాలు వచ్చేలా గట్టిగా మాట్లాడుతోంది.ఇది భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ సమయంలో చిలుక విన్న మాటలుగా భావిస్తున్నారు పోలీసులు.

దీన్ని కోర్టులో సాక్ష్యంగా చూపెట్టాలని పోలిసుల ఆలోచన.అయితే కోర్టు చిలుక సాక్ష్యాన్ని ఒప్పుకుంటుందా లేదా అనేది ఇంకా నిర్థారించాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube