వర్మ పవన్ మీద పగబట్టడానికి పరిటాల రవి ఇష్యూ కారణమా?

పొద్దున్న లేచిన దగ్గరినుంచి, రాత్రి నిద్రపోయేదాకా పవన్ నామస్మరణ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ.అదేదో నాలుగు మంచి మాటలు మాట్లాడితే ఫర్వాలేదు కాని రోజంతా పవన్ ని విమర్శించడమే వర్మ పని అయిపోయింది.

 Paritala Issue, The Reason Behind Rgv – Pawan Rivalry?-TeluguStop.com

పవన్ సినిమా తీస్తే వెక్కిరింపే, పవన్ జనసేనకి సంబంధించిన చిన్న ప్రెస్ మీట్ పెట్టినా వేళాకోళమే.ఓరకంగా చెప్పాలంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నిద్రలేని రాత్రులని ఇస్తున్నాడు ఆర్జీవి.

ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటంటే, తాను ఒక్కడే తిట్టడం కాదు, తన క్లోజ్ ఫ్రెండ్, బాలివుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ (కేఆర్కే) చేత కూడా తిట్టుస్తున్నాడు.అంతేగా మరి, ఎక్కడో దుబాయ్ లో ఉండే కేఆర్కేకి పవన్ కళ్యాణ్ మీద పంపిణిదారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారని ఎలా తెలుసు? ఎవరో ఒకరు చెబితే తప్ప.

ఇంతకి వర్మ పవన్ మీద ఇలా పగబట్టడానికి కారణం ఏమిటి ? చిరంజీని నొచ్చుకున్నా పట్టించుకోవట్లేదు, నాగబాబు బూతులు తిట్టినా బేఖాతరు చేస్తున్నాడు, స్వయంగా పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయినా లెక్క చేయట్లేదు, ఇక వర్మ మీద ట్విట్టర్ లో దాడి చేస్తున్న పవన్ కళ్యాణ్ మనుషులు బండ్ల గణేష్, శివబాలాజి అంటే వర్మకి పట్టింపే లేదు, ఒక పవర్ స్టార్ అభిమానుల తిట్లని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు.ఎందుకిలా? ఇంతా జరిగిన తన మాటల దాడి ఆపట్లేదు.వర్మ ఎందుకు అలా పగబట్టేసాడు.

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే వర్మ రక్తచరిత్ర అనే సినిమా తీసాడు.అందులో పరిటాల – పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఓ వివాదస్పద సన్నివేశం ప్రోమోలలో కనబడింది.అప్పుడే పవన్ కి వర్మకి మధ్య ఏదో గొడవ జరిగి ఉంటుందని, అదంతా మనసులో పెట్టుకోనే రాము పవన్ కి వ్యతిరేకంగా మారి ఉండవచ్చు అని ఫిలింనగర్ జనాలు మాట్లాడుకుంటున్నారు.

మరి మీరేం అంటారు?

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube