వెర్రి వెయ్యి రకాలు, పైత్యం పలు విధాలు అని అన్నారు ఎవరో మహానుభావులు.బహుశా పరిణితి చోప్రా లాంటి వాళ్ళకోసమే అన్నారేమో ఈ మాట.
ఇంతకి పరిణితి ఏం చేసింది.ఒక మిలియన్ ఖర్చు పెట్టి రెండు టీషర్ట్స్ కొనుక్కుందట.
డబ్బులు ఎక్కువయిపోయాయో, లేదంటే ఎవరినైనా కుళ్ళుకునేల చేయాలి అనుకుందేమో పరిణితి చోప్రా .లేనోడు లేక ఏడుస్తుంటే .వీళ్ళ పైత్యం ఏమిటో .ఇలా అనుకుంటూ పరిణితి ని తిట్టుకున్తున్నారా .అయితే ఆగండి .పరిణితి మరీ ఎక్కువేమి ఖర్చు పెట్టలేదు.అదేంటి, మిలియన్ అంటే పది లక్షలు కదా అనుకుంటున్నారా … పరిణితి మిలియన్ పెట్టి బట్టలు కొనుకున్నది జాకర్త లో .అక్కడి మిలియన్ అంటే మన రూపాయలలో సరిగ్గా 4652.73 రూపాయలు .మిలియన్ అంటూ అందరిని బకరా చేసి తన పైత్యం చూపించింది.ఈ విషయాన్నీ పరిణితి స్వయంగా ఇన్స్టగ్రామ్ లో పోస్ట్ చేసింది.“I paid one million for two tshirts.#CrazyCurrency #Jakarta”