తెలుగు కుస్తీ పడుతున్న బాలీవుడ్ భామ..!

సూపర్ స్టార్ మహేష్, మురుగదాస్ సినిమాలో హీరోయిన్ గా పరిణీతి చోప్రా సెలెక్ట్ అయినట్టే.అఫిషియల్ గా చెప్పలేదు కాని అమ్మడు సినిమా కోసం హోం వర్క్ కూడా స్టార్ట్ చేసింది.

 Parineethi Learn Telugu For Mahesh Movie-TeluguStop.com

అదేంటి అంటారా అదే తెలుగు నేర్చుకోవడం కూడా మొదలు పెట్టిందట బీ టౌన్ బ్యూటీ పరిణీతి చోప్రా.బాలీవుడ్ హాట్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ భామ మొదటిసారి ఓ సౌత్ సినిమా చేస్తుంది.

అందుకే పర్ఫెక్ట్ గా ఉంటే ఇక్కడ సెటిల్ అవొచ్చు అన్న ఆలోచనతో సినిమాకు కావాల్సిన తెలుగు భాష కోసం కుస్తీ పడుతుందట.సినిమా కోసం సౌత్ లో నటిస్తున్న పరిణీతి తెలుగు తమిళ భాషలపై అవగాహన కోసం ప్రయత్నాలు చేస్తున్నానని ఈ మధ్య ఓ పబ్లిక్ మీట్ లో అన్నది.

మరి మార్కెట్ లో దొరికే 30 రోజుల్లో తెలుగు భాష నేర్పబడును బుక్ కొంటే కాస్త కూస్తో ఆమెకు ఉపయోగపడే అవకాశం ఉంది.

మహేష్ కు జోడిగా నటించేందుకు ఓకే చెప్పిన ఈ సుందరి నిర్మాతల దగ్గర నుండి భారీ రెమ్యునరేషన్ కూడా వసూళు చేస్తుందట.

సో మొత్తానికి మహేష్, మురుగదాస్ సినిమాపై పరిణీతి వర్క్ స్టార్ట్ చేసింది.ఇక మహేష్ బాబు ఓకే అనడం ఆలస్యం షూటింగ్ స్టార్ట్ చేసేయడమే.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube