పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు ఎలా నేర్పాలి ?

పుస్తకాలు చదవడం అనేది ఎంత గొప్ప అలవాటో మాటలతో చెప్పడం కంటే జీవితంలో ఎత్తులను చూసిన దిగ్గజాల అనుభవం తెలుసుకుంటే మరింత బాగా బోధపడుతుంది.పుస్తకాలు చదవడం అనేది చిన్ననాటి నుండే అలవాటు ఉండాలి.

 How To Make Children Read Books ?-TeluguStop.com

ఇక్కడ పుస్తకాలు అంటే పరీక్షల్లో మార్కుల కోసం బట్టిపట్టేవి కావు.జీవితాన్ని నేర్పేవి, విలువల్ని నేర్పేవి, అలోచనా శక్తిని పెంచుతూ జ్ఞానాన్ని అందించేవి.

మరి ఈ రీడింగ్ హ్యాబిట్ మీ పిల్లల్లో చూడాలంటే ఏం చేయాలి ?

* మీ అలవాట్లే పిల్లలపై ప్రభావం చూపుతాయి.కాబట్టి ఇంట్లో పెద్దవారికి పుస్తకాలు చదివే అలవాటు ఉంటే, పిల్లలు సునాయాసంగా పుస్తకాలకి అలవాటు పడతారు.

* పుస్తకాలు తీసుకురావడమే కాదు, మీకు మీరు చదువుకోవడమే కాదు, పిల్లల్ని చదివించడం కాకుండా, పిల్లలతో కలిసి చదవటం మొదలుపెట్టండి.స్కూల్లో టీచర్ లా కాకుండా, కలిసి చదవుకుంటున్న నేస్తంలా మెదలండి.

* కేవలం ఇంట్లో చదివించడమే కాదు, వారానికి ఒకటి రెండుసార్లు లైబ్రరీకి తీసుకెళ్ళండి.పిల్లలకి కొత్త పుస్తకాలు కనబడుతూ ఉండాలి.

అన్నిరకాల పుస్తకాల మీద ఆసక్తి కలగాలి.

* చదివి అలా వదిలేయడమే కాదు, ఓ పుస్తకం మీద మీ అభిప్రాయాలు చెప్పండి, అలాగే పిల్లలు చదివిన పుస్తకం ఎలా ఉందో అడిగి తెలుసుకోండి.

పుస్తకాల గురించి చర్చించండి.అచ్చం సినిమాల గురించి మాట్లాడుకున్నట్లుగా మాట్లాడండి పుస్తకాల గురించి.

* పిల్లల జీవితంలో పుస్తకం ఎంతో పనికివచ్చే వస్తువు అనే ఇమేజ్ క్రియేట్ చేయండి.బహుమతుల కింద పుస్తకాలు ఇవ్వండి.

* ఇక చివరిదైనా, చాలా ముఖ్యమైన విషయం.గొప్ప గొప్ప పుస్తకాలు మామూలు మనుషులని గొప్పవారిగా ఎలా తీర్చిదిద్దాయో, గొప్పవారిని మరింత ఉన్నత శిఖరాలకు ఎలా చేర్చాయో చెబుతూ ఉండండి.

దీనివలన స్పూర్థి పొందుతారు పిల్లలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube