శృంగార నటి జంతు ప్రేమ

పమేలా ఆండర్సన్‌ ఎవరో ఇంగ్లీషు సినిమాలతో, ఇంగ్లీషు టివి కార్యక్రమాలతో పరిచయం ఉన్నవారికి తెలుసు.ఒకప్పుడు ఓ ఛానెల్‌లో ప్రసారమైన ‘విఐపి’ అనే సీరియల్లో ఆమె ప్రధాన పాత్ర పోషించి తన ‘భారీ అందాల’తో కుర్రకారును ఉర్రూతలూపింది.

 Pamela  Urges Kerala Cm Not To Parade Elephants-TeluguStop.com

వయసు మీరినా ఇంకా అకర్షిస్తూనే ఉంది.ఈ శృంగార నటి కేరళలోని త్రిసూర్‌ ఆలయానికి ఓ విజ్ఞప్తి చేసింది.

ఏమిటది అంటే….వచ్చే బుధవారం జరిగే ఆలయ ఉత్సవాల్లో ఏనుగుల చేత కవాతు చేయించొద్దని కోరింది.

దీనిపై కేరళ ముఖ్యమంత్రి ఊమన్‌ చాందీకి, ఆలయ పాలక మండలికి లేఖ రాసింది.తన ప్రతిపాదనకు అంగీకరిస్తే ముప్పయ్‌ పెద్ద, చిన్న ఏనుగుల కొనుగోలు ఖర్చును తాను భరిస్తాననని చెప్పింది.

పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ ఎనిమల్‌్స (పెటా)లో పమేలా ఆండర్సన్‌ సభ్యురాలు.దీంతో జంతు హింసకు వ్యతిరేకంగా ప్ర చారం చేస్తోంది.

మరి ఈమె విజ్ఞప్తిని కేరళ ప్రభుత్వం, ఆలయ పాలకమండలి ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటాయో.ప్రపంచవ్యాప్తంగా అనేకమంది సినిమా నటీమణులు పెటాలో సభ్యులై జంతు సేవ చేస్తున్నారు.

తెర మీద ఎంత శృంగారం ఒలకబోసేవారిని జనం చిన్న చూపు చూస్తారుగాని వారిలోనూ మంచి, మానవత్వం ఉంటాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube