పైసా వసూల్ ఫ్లాప్ ... హమ్మయ్య అనుకున్న ఎన్టీఆర్

దర్శకుడు పూరి జగన్నాథ్ పునర్వైభవాన్ని సంపాదించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.కాని అస్సలు కుదరట్లేదు.

 Paisa Vasool Falls Flat .. Ntr Escapes A Bad Result-TeluguStop.com

పోకిరి లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ తరువాత ఆయన సినిమాలలో క్వాలిటి పెరగాలి కాని క్రమంగా ఆయన కెరీర్ గ్రాఫ్ లానే తగ్గుతూ వచ్చింది.మళ్ళీ మహేష్ బాబుతో టీం అప్ అయ్యి చేసిన బిజినెస్ మెన్ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది.

వక్కంతం కథతో తీసిన టెంపర్ కూడా అంతే.ఈ రెండు సినిమాల్లో స్టార్ హీరోలు ఉన్నారు కాబట్టి ఆమాత్రం అయినా లాగాయి సినిమాలు.

ఇక మహేష్, ఎన్టీఆర్ తో కాకుండా చేసిన సినిమాలన్నీ అట్టర్ ఫ్లాపులుగా నిలిచాయి.పూరిలో పైత్యం పెరిగిపోయిందని ప్రేక్షకులు అభిప్రాయపడుతోంటే,, విషయం అయిపోయిందని స్టార్ హీరోలు పక్కనపెడుతున్నారు

చిరంజీవి, మహేష్ బాబు, ఎన్టీఆర్ వీరి తరువాత వెంకటేష్ .అందరు పూరి జగన్నాథ్ తో సినిమాకి ఒప్పుకోలేదు.ఆయన టేకింగ్ మీద నమ్మకం సడలిందో లేక కథ నచ్చలేదో కాని, మహేష్ బాబు అయితే అనౌన్స్ చేసిన “జనగణమన” ప్రాజెక్టు ని కూడా క్యాన్సల్ చేసుకున్నాడు.

ఇక పైసా వసూల్ కథ మొదట ఎన్టీఆర్ కి చెప్పిందే అంట.మొదట పాజిటివ్ గానే స్పందించిన యంగ్ టైగర్, ఆ తరువాత తన పీఆర్ టీం సూచన మేరకు పూరిని పక్కన పెట్టేసాడట.ఆ తరువాత బాలయ్య ముందు వాలారు పూరి జగన్నాథ్.ఆరకంగా పైసా వసూల్ తయారయ్యింది

మొదటి రోజు చాలా సాదరమైన ఓపెనింగ్స్ రాబట్టుకున్న ఈ సినిమా, రెండోవరోజు చాలా డౌన్ అయిపొయింది.

మొదటిరోజు వర్త్ షేర్ లెక్కలకి, రెండోవరోజు షేర్ లెక్కలకి 50% కంటే కూడా ఎక్కువ తేడా వచ్చేలా ఉంది.అంటే 50% కి పైగా పడిపోయింది రెండోవరోజు.

బిజినెస్ పరంగా సేఫ్ గేమ్ ఆడుతూ,తక్కువ రేట్లకే అమ్మినా, ఈ ఓపెనింగ్స్ ని బట్టి చూస్తే, అలాగే సినిమా టాక్ ని బట్టి చూస్తే, మహా అయితే, యావరేజ్ కన్నా ముందుకి పోయే సూచనలు కనిపించడం లేదు.సోమవారం నుంచి సినిమా పడిపోతే ఫ్లాప్ రిజల్ట్ పొందినా పొందవచ్చు.

ఈరకంగా ఎన్టీఆర్ ఓ పరాజయాన్ని తప్పించుకున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube