Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

సెక్స్ లో నొప్పి .. దేనికి సంకేతం ?-Pain In Sex Shouldn’t Be Ignored For These Reasons

సెక్స్ లో నొప్పి కలగటం ఇదివరకు మనం వినని సమస్య కాదు. ముఖ్యంగా స్త్రీలలో ఈ సమస్య ప్రధానంగా కనిపిస్తుంది. ప్రతి 10 మంది మహిళల్లో ఒకరు లేదా ఇద్దరికి శృంగారం సమయంలో నొప్పి కలగవచ్చు అని పరిశోధనలు తెలుపుతున్నాయి. కాని ఆ ఫ్లోలో పట్టించుకోకపోవడం, మిగితావారికి కూడా ఈ నొప్పి ఉంటుందేమో, సాధారణ విషయం ఏమో అని అపోహలో ఉండటం జరుగుతుంది.

ఇలా అజాగ్రత్తగా ఉండటమే కొంప ముంచుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఇలా ఊరికే జరగకపోవచ్చు, వెజైనల్ ఇంఫెక్షన్స్, ఇట్చింగ్ వలన జరగొచ్చు అని, అంతేకాక Chlamydia, Gonorrhoea వంటి సుఖవ్యాధులు ప్రమాదలు లేకపోలేదు అని సెక్సాలాజిస్టులు చెబుతున్నారు.

Vaginismus అనే మరో కండిషన్లో యోని దగ్గర నరాలు బిగుసుకుపోవడం వలన కూడా ఇలా జరుగుతుంది. అలాగే మానసికంగా సెక్స్ పట్ల అయిష్టత ఉన్నా కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుందని, అందుకే సెక్స్ సమయంలో నొప్పి కలిగితే ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలని ప్రముఖ సెక్సాలాజిస్ట్ సమంత ఎవాన్స్ చెప్పుకొచ్చారు.

Continue Reading
To Top