ఆయన చేతుల్లోకి వెళ్లిన పాడుతా తియ్యగా..?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ సింగర్ లు ఉన్నారు.వీరందరూ ఇండస్ట్రీలోకి రావడానికి పాడుతా తీయగా వేదిక పునాదులుగా మారిందని చెప్పవచ్చు.

 Padutha Teeyaga Program Restarted With Sp Charan Details,  Sp Balasubramaniam, S-TeluguStop.com

గత పాతిక సంవత్సరాల నుంచి ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విశేషమైన ఆదరణ దక్కింది.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది గాయనీ గాయకులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

గత 25 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమం అమాంతం ఆగిపోయింది.

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు గత ఏడాది అనారోగ్యం కారణంగా మరణించడం వల్ల ఆయన మరణం తర్వాత ఈ కార్యక్రమాన్ని ఆపివేశారు అంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్వాహకులు ఈ కార్యక్రమ బాధ్యతలను ఎస్పీ బాలసుబ్రమణ్యం కొడుకు ఎస్ పి చరణ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇకపై పాడుతా తీయగా బాధ్యతలను ఎస్పీ చరణ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Telugu Chandrabose, Paduthateeyaga, Suneetha, Spbalu, Sp Charan, Tollywood, Vija

ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఆన్లైన్ ద్వారా 4 వేల మందిని ఆడిషన్ చేయగా కేవలం 16 మందిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమ బాధ్యతలను ఎస్పీ చరణ్ తీసుకోగా ఈ కార్యక్రమంలో చంద్రబోస్, సునీత, విజయ్ ప్రకాష్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.ఎస్పీ చరణ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం మాదిరిగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా లేదా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతుందా అనే విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube