కబాలి డైరక్టర్ కు రజిని మరో ఛాన్స్..

కబాలి తో రజిని సినిమా రేంజ్ ఏంటో రిలీజ్ కు ముందు హడావిడి చేసిన దర్శకుడు పా.రంజిత్ రిలీజ్ తర్వాత సినిమా ఫలితం ఆ రేంజ్లో అందుకోలేకపోయాడు.

 Rajinikanth Again Chance To Pa.ranjith..?-TeluguStop.com

అయితే మిగతా భాషల్లో ఎలా ఉన్నా కబాలి తమిళంలో హిట్ అనేస్తున్నారు.రజిని స్టైల్ కు అక్కడ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ఓవరాల్ గా సినిమా హిట్టా ఫట్టా అని కాకుండా కొత్త దర్శకుడే అయినా రజిని సినిమాను టాప్ రేంజ్ పబ్లిసిటీ తెచ్చిపెట్టిన ఘనత దర్శకుడు పా.రంజిత్ సాధించాడు.అయితే కబాలి తర్వాత రంజిత్ ఎవరి సినిమ చేస్తాడా అనుకున్నారు.

కాని ఫైనల్ గా మళ్లీ సూపర్ స్టార్ రజినికాంత్ నే మరళ రెండోసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు రంజిత్.

ఇదేదో రూమర్ అనుకుంటే పొరపాటే స్వయానా రజిని అల్లుడు కోలీవుడ్ హీరో ధనుష్ ఈ విషయాన్ని వెళ్లడించారు.వండర్ బార్ ఫిలిమ్స్ బ్యానర్ పై మా తర్వాత సినిమా ఉంటుంది.

రంజిత్ డైరక్షన్లో రజినికాంత్ హీరోగా చేస్తాడని ఓ చిన్న వీడియో షేర్ చేశాడు.

ప్రస్తుతం రోబో 2.0 షూట్లో ఉన్న రజినికాంత్ మరళ రంజిత్ కు అవకాశం ఇవ్వడం మెచ్చుకోదగ్గ విషయమే.మరి ఈసారి కబాలి రేంజ్ స్టైలిష్ తో పాటుగా మంచి కథతో వస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube