ఆ ఒక్క జబ్బుతో ప్రతీ ఏడాది 6 లక్షలమంది ఇండియన్స్ చనిపోతున్నారు

క్యాన్సర్ ఎంత ప్రాణాంతకమైన జబ్బో మనందరికి తెలుసు.కాని ఇది ప్రతీ ఏటా, ఒక్క భారతదేశంలోనే లక్షల ప్రాణాలని హరించుకుపోతోందనే విషయం ఎంతమందికి తెలుసు! అవును, వరల్డ్ హెల్త్‌ ఆర్గనైజేషన్ (WHO) అందించిన రిపోర్టు ప్రకారం, మనదేశంలో ప్రతీ సంవత్సరం 10 లక్షలమందికి పైగా క్యాన్సర్‌ బారిన పడుతున్నారట.అందులో 6.80 లక్షలమంది, అంటే దాదాపుగా 7 లక్షలమంది ప్రాణాలు వదిలేస్తున్నారట.చూసారా ….ఒక్క జబ్బు ఎన్ని కుంటుంబాలలో కన్నీళ్ళు తీసుకొస్తోందో!

 Over 6 Lakh Indians Die Every Year Due To Cancer – Minister Anupriya Patel-TeluguStop.com

ఈ వివారల్ని హెల్త్‌ మినిస్టర్ అనుప్రియ పటేల్ తెలియజేస్తూ ” మన దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 7% శాతం క్యాన్సర్ పేషెంట్లు ఉంటున్నారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టు చేసినట్లుగా, ప్రతి సంవత్సరం ఒక మిలియన్ కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయి.వారిలో 6.80 లక్షలమంది చనిపోతున్నారు.ఈ క్యాన్సర్‌ రావడానికి చాలారకాల కారణాలున్నాయి.

వృద్ధాప్యంలో ఉన్న జనాభా కావచ్చు, ఆరోగ్యకరంగా లేని జీవనశైలి కావచ్చు, ధూమపానం, తిండి అలవాట్లు, కలుషితమైన గాలి పీల్చడం కావచ్చు.మనం ఈ సమస్యపై పోరాడాలి” అని చెప్పుకొచ్చారు అనుప్రియ.

గాలి కాలుష్యానికి సమాధానంగా, పెట్రోలియం మినిస్ట్రీ బిలో పావర్టి లైన్ లో ఉన్న మహిళలకు త్వరలోనే “ప్రధానమంత్రి ఉజ్జ్వల యోజన” కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేయడం జరుగుతుందని, గాలి కాలుష్యం – ఆరోగ్యం మీద ప్రత్యేక దృష్టి పెట్టడానికి త్వరలోనే ఓ స్టీరింగ్ కమిటి ఏర్పాటు చేయనున్నట్లు అనుప్రియ పటేల్ ఈ సందర్భంగా తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube