ఆ నిర్ణయం చంద్రులకి కనిపించేనా ?

గాంధీ కల‌లు కన్న ‘మద్య రహిత భారతం’ కోసం ప‌లు రాష్ట్రాల పాల‌కులు చేసిన ప్రయత్నాలు సఫం కాకపోవటం వెనుక ్ర‌ప‌ధాన కార‌ణం అమ‌లు చేసే నాయకులు, ప్రభుత్వాల‌ చిత్త శుద్ధిలోపమేన‌న్నది అక్షర సత్యం.దేశానికి స్వాతంత్రం తెచ్చామని చెప్పుకునే వారసుల‌ పార్టీలోనే లిక్కర్‌కింగులుం సారా మాటున‌ అయినకాడికి దండుకోవటమే ధ్యేయంగా జనం బహీనతని సొమ్ము చేసుకున్న వైనాలు అనేకం చూసాం మనం.

 Our Cms Will Implement The Decision Of The Tamilnadu Cm-TeluguStop.com

గాంధీయిజం పోయి బ్రాందీయిజం వచ్చిందంటూ సరిపెట్టుకుని, ఉన్నంతలో మనమూ అడపా దడపా కాసింత తీర్ధం పుచ్చేసుకుంటూ నిషేదాన్ని నిలువెట్టి పాతేసాం

వాస్తవానికి దక్షిణ భారతాన మద్య నిషేదం కొత్త అంశం కాదు.అందునా మ‌న తెలుగునాట నాటి ముఖ్య‌మం్ర‌తి ఎన్టీఆర్‌ హయాంలో మద్య నిషేదం కొంత మేర అమలైనా, ప‌క్క రాస్ట్రాలలో నిషేధం ;లేక పోవటంతో నాటు ఏరులై పారితే, నీటు చాటుగా వచ్చి దొంగలకి కాసుల వర్షాన్ని కురిపించిన వైనాన్ని కన్నాం.

ఆపై పగ్గాందుకున్న మన బాబుగారు ఊపిరి సపని పథకాల‌తో పాటు అక్రమ మద్యం మాటున‌ జనం కష్టాలంటూ ఖజానాకు పడుతున్న గండీను పూడ్చుకునేందుకు వీలుగా మద్యమే అసు సిసలైన ‘మందు’గా గుర్తించి నిషేదాన్ని ఎత్తి పడేశారు.ఆబ్కారీ శాఖ కు టార్గెట్లు పెట్టి మరీ అమ్మకాలు పెంచాలని నిర్దేశాలు జారీ చేయడంతో ఊరూరా బెల్టులు వచ్చిపడ్డాయి,

మద్య నిషేదానికి మంగళ హారతి ఇచ్చారని విమర్శ‌లు గుప్పించిన కాంగీయులు అధికారంలోకి రాగానే మద్యాన్ని మ‌రింత పారించడం, నీరు కన్నా బీరే మిన్న అనే స్ధాయిలో అమ్మకాలు కొనసాగించార‌న్న‌ది నిజం, ఇందులో మంత్రు, ఎమ్మెల్ల్యేలు ఒక‌రేమిటి అంతా అధికారిక సిండికేట్లను నడిపి తెలుగు తాగుబోతుల‌ జేబు దొచుకున్న వైనం తెలిసిందే.

ఆపై తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక‌యినా నిషేదం అమ‌ల‌వుతుంద‌న్న ఆశ ఆకాశంలోనే ఉంచేసారు మ‌న నేత‌లు.భావోద్వేగా నడుమ జనాన్నిఉంచి గెల‌చిన చంద్రులిద్దరూ పూటుగా మద్యం తాగండ్రో… ఖజానాని నింపండ్రో… అని చెప్తున్నారు మినహా మద్యనిషేదం అని మచ్చుకైనా మాట అన‌డంలేదు.

అయితే తమిళనాట పరిస్ధితి భిన్నంగా కనిపిస్తోంది మనకి…

మొన్నటి ఎన్నికల్లో దశవారీ మద్య నిషేదం హామీ ఇచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి తన హామీని నిుపుకునే ప్రయత్నాల‌ని ప్రారంభించారు.ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆమె తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ నిర్వహించే 500 మద్యం షాపు లైసెన్సుని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వుపై తొలి సంతకం చేయటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

అలాగే ఇకపై మద్యం షాపు అమ్మకా సమయాన్ని ఉదయం 12 గంట నుంచి రాత్రి 10 గంట వరకే జరగాని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.ప్రస్తుతం ఉన్న 6,720 మద్యం షాపుల్లో ఒక్క సారిగా 500ు మూసివేయటంతో 6,220 ఇక పై రోజూ 10 గంట పాటు మాత్రమే పనిచేయనున్నాయి.

మరి ఎన్నిక సందర్భంగా భారీగా తాయిలాలు ప్రకటించిన అమ్మ పథకాలు కొనసాగించేందుకు నిధుల‌ సమీకరణ ఎలా గో చూడాలి మరి.

జయమ్మ చూపిన బాటలో పథకాల‌కు తమ పేర్లను పెట్టడం ప్రారంభించిన మ‌న తెలుగు నేత‌లు ఈ విషయంలో అమ్మ‌ని ఆదర్శంగా తీసుకుంటారా? అన్నది సంశయమే….అయినా మన మందుబాబు చాపల్యాన్ని కొంతైనా తగ్గించేలా అమ్మకా సమయంతో పాటు షాపుల‌ సంఖ్యను కుదించేందుకు ఈ తరహా నిర్ణయం చేస్తే ….బెటరేమో… చూద్దాం ఏం జరగనుందో…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube