ఫేస్ బుక్ ని మించిన సోషల్ సైట్ వచ్చేసింది ..

పదవ తరగతి దాకా కూడా రాకముందే ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్న ఇప్పటి పిల్లలకి ఆర్కుట్ అంటే ఏమిటో కూడా తెలియదు అనుకుంటా.ఒకప్పుడు ఫేస్ బుక్ కాదు పాపులర్ .

 Orkut Comes Back As “hello” .. Potential Competitor Of Facebook-TeluguStop.com

ఇంటర్నెట్ అంటే ఆర్కుట్ అన్నట్టుగా ఉండేది.రెండూ 2004వ సంవత్సరంలోనే మొదలైనా, ఆరోజుల్లో ఆర్కుట్ హవా ముందు ఫేస్ బుక్ ని పెద్దగా పట్టించుకునేవారు కాదు.

కాని అదృష్టం చేతులు మారింది.ఆర్కుట్ పతనం, ఫేస్ బుక్ ఎదుగుదల .రెండు ఒకేసారి మొదలయ్యాయి.చివరకి నష్టాలు ఎందుకు అని 2014 సంవత్సరంలో ఆర్కుట్ ని మూసేసింది గూగుల్.

కాని ఆ ఆర్కుట్ సృష్టికర్త ఆర్కుట్ బుయుక్కోట్టేన్ మరో సోషల్ సైట్ తో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.ఫేస్ బుక్ మీద పగ తీర్చుకునేందుకు కొత్త సైట్ ని ప్రారంభించాడు.అదే www.hello.com.దీని పేరు హల్లో నెట్వర్క్.

ఇంకా Early Access లోనే ఉన్న హల్లో యాప్ .మరికొన్ని రోజుల్లో పూర్తిగా సిద్ధమై మనముందుకి రానుంది.ప్రస్తుతానికైతే దీంట్లో ఫేస్ బుక్ కన్నా బెట్టర్ ఆప్షన్స్ ఉన్నాయి.దీంట్లో మీరు మీ అయిదు అభిరుచలను సెలెక్ట్ చేసుకోవచ్చు.ఉదాహరణకు మీ అభిరుచులు సినిమా, క్రికెట్, మ్యూజిక్, పోలిటిక్స్, ఫ్యాషన్ అనుకుందాం.ఈ అయిదు అభిరుచులు మీర్ సెలక్ట్ చేసుకుంటే, ఈ టాపిక్స్ మీద పడే పోస్టులు చాలావరకు మీ టైం లైన్ మీదకి వస్తాయి.

మీరు వారితో స్నేహితులై ఉండక్కరలేదు.అభిరుచులు కలిస్తే చాలు.

అలాగే మీ ఫ్రండ్స్ తో కూడా టచ్ లో ఉండొచ్చు.అక్కడే చాటింగ్ చేయవచ్చు.

ఫేస్ బుక్ లాగా మెసేజింగ్ కోసం మళ్ళీ వేరే యాప్ వాడాల్సిన అవసరం లేదు.

మీర్ ఒక కమ్యూనిటి క్రియేట్ చేయవచ్చు.

వేరే కమ్యునీటీస్ లో జాయిన్ కావచ్చు, మీ ఇంటరెస్ట్ ని బట్టి ఎలాంటి సమాచారాన్ని అయినా పొందవచ్చు.అలాగే మీ అభిరుచులని ఎప్పటిక్కప్పుడు మార్చుకోవచ్చు.

ఫేస్ బుక్ లో మాదిరే దీంట్లో పోస్టులకి లైక్, కామెంట్ చేయవచ్చు.రాన్నున్న రోజుల్లో దీంట్లోకి మరిన్ని ఆప్షన్స్ రానున్నాయి.

ఆసక్తికరంగా అనిపిస్తే ఓసారి అకౌంట్ ఓపెన్ చేసి చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube