ఓరి దేవుడా: భార్యలని కూడా బాడుగకు ఇచ్చేస్తున్నరా..?!

మన భారతదేశం రకరకాల మతాలు, సంప్రదాయాలు, ఆచారాలకు పెట్టింది పేరు అనే చెప్పాలి.ఎవరి సంప్రదాయాలు వారు పాటిస్తూ ఉంటారు.

 Are You Also Renting Wives, Wife, Husband, Latest News, Rent, Latest Viral, Late-TeluguStop.com

ఎవరి ఆచారాలు వారివి.ఒక్కోసారి ఆ ఆచారాలు,మూఢనమ్మకాలు చూస్తుంటే భలే వింతగా ఉంటాయి.

అలాగే మన సంప్రదాయంలో పెళ్లి అనే బంధానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.పెళ్లి చేసుకున్న భార్య భర్తలు ఇద్దరూ వివాహ బంధానికి కట్టుబడి పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకోకుండా సంసారం అనే బంధాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తారు.

పెళ్లి అయిన వివాహిత పరాయి పురుషునితో కొంచెం చనువుగా మెదిలితేనే తప్పుపట్టే సమాజం మనది అలాగే మరికొందరు భర్త ఉన్నాగాని వేరే వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ కాపురాలు పాడుచేసుకుంటు, గొడవలు, హత్యలు చేసే సంఘటనలను మనం చాలానే చూసి ఉంటాము.కానీ, కట్టుకున్న భార్యను లీజుకు ఇచ్చే సంప్రదాయలు, ఆచారాలు ఉన్నాయనే విషయం మీకు తెలుసా.

ఏంటి భార్యను వేరే వ్యక్తికి లీజ్ కు ఇవ్వడం ఏంటి అని షాక్ అవుతున్నారా.? కానీ మధ్యప్రదేశ్‌ లోని శివపురి జిల్లాలో ధడిచా ప్రాథ అనే ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది.

అసలు వివరాల్లోకి వెళితే.మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ధడిచా ప్రాథ విపరీతంగా ఉంటుంది.బాగా డబ్బులు ఉండి, భాగస్వామి దొరకని అగ్రవర్ణాల మగవారు ఇలా ఇతరుల భార్యలను అద్దెకు తెచ్చుకుని ఒక నెల నుంచి ఏడాది పాటు మరొకరి భార్యను తెచ్చుకుని ఇంటి పనులతో పాటు, పడక సుఖం కూడా పొందుతారు.ఒకరకంగా చెప్పాలంటే ఆమె ఒక నిర్ణిత కాలం పాటు ఆ ఇంటి తాత్కాలిక కోడలు అన్నమాట.

అలాగే ఆ వివాహిత భర్తలు ఇందుకు స్టాంపు పేపర్ల మీద సంతకాలు చేసి మరీ వ్యాపారం చేస్తారట.మధ్యవర్తుల ప్రమేయంతో ఇలాంటి పనులు జరుగుతున్నాయి.

మధ్యవర్తులు డబ్బులు ఉన్నవారితో పరిచయాలు చేసుకుంటూ మారుమూల గ్రామాల్లోని పేద ప్రజల ఇబ్బందులను ఆసరాగా చేసుకుని ఇలాంటి పనులకు ఒప్పిస్తున్నారు.ముఖ్యంగా గిరిజన ప్రాంత మహిళలు ఈ పని ఇష్టం లేకపోయిన తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

ఇంకో విషయం ఏంటంటే.భార్యలనే కాదు కూతుళ్లను కూడా ఇలాంటి పనులకు వాడుకుంటున్నారు అంటే నిజంగా ఇది సభ్య సమాజం తలదించుకునే ఆచారం అనే చెప్పాలి.కొన్ని కుటుంబాల్లో భార్యలను రూ.500 కంటే తక్కువకు అద్దెకు ఇచ్చిన సంఘటనలు ఉంటే.మరి కొన్ని కుటుంబాల్లో కూతుర్లను రూ.50000 కు అప్పగిస్తున్నారు.అక్కడి వారికి ధడిచా ప్రాథ ఆచారం ఆనవాయితీగా వస్తోందని అందుకే ఏ ఒక్కరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంలేదని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube