సబ్బు వద్దు .. ఈ ఆరెంజ్ పౌడర్ వాడండి ఈ వేసవిలో

ఆరెంజ్ సిట్రస్ జాతిలో దొరికే అతిముఖ్యమైన ఫలాలలో ఒకటి.ఇది మార్కెట్లో చాలా చవగ్గా దొరుకుతుంది.

 Orange Peel Powder And It’s Benefits For Your Skin-TeluguStop.com

విటమిన్ సి దండిగా లభించే ఆరెంజ్ చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది.యాంటిఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండటం వలన ఇది మీ ముఖ సౌందర్యానికి పనికివస్తుంది.

నిజానికి మార్కెట్లో దొరికే ఫేస్ ప్రాడక్ట్స్ కన్నా, అరేంజ్ నే మీరు చర్మ ఆరోగ్యానికి ఉపయోగించువచ్చు.అదికూడా తినేసి, మిగిలిన తోక్కతోనే చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.

మాటిమాటికి తొక్కతీసి దాన్ని ముఖ్యంపై రుద్దుకోవడానికి బద్ధకంగా అనిపిస్తే, ఒకేసారి ఆరెంజ్ తొక్కలతో పౌడర్ తయారుచేసుకోని, దాన్ని కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు.ఇక ఆరెంజ్ పౌడర్ ని ఎలా తయారుచేయాలి అని మీరు అడగవచ్చు.

చాలా సింపుల్ ఇది.కొన్ని తొక్కలని తీసుకొని, వాటిని బాగా ఎండబెట్టి, పౌడర్ లా గ్రైండ్ చేసుకోండి.దీన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూద్దాం.

* రెండు మూడు స్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ ని తీసుకొని దాన్ని కొద్దిగా యొగ్ రట్ లో మిక్స్ చేసుకొని, ఆ మిశ్రమంలోకి కొంత తేనే, కొంత పసుపు కలుపుకొండి.

దీన్ని రోజు చర్మానికి పట్టండి.ఓ ఇరవై నిమిషాలపాటు ఉంచి కడిగేసుకోండి.ఇలా రోజు చేస్తే, మీ చర్మరంగు లైట్ గా మారుతూ ఉంటుంది.

* ఆయిల్ స్కిన్ ఉన్నవారి ఇబ్బందులు అన్నిఇన్ని కావు కదా.మరీ ముఖ్యంగా ఈ ఎండకాలంలో ఆయిల్స్ సమస్య మరింత పెరిగిపోతుంది.ఈ సమస్యకి పరిష్కారమార్గం ఆరెంజ్ పౌడర్.

పాలలో, కొంత పసుపు వేసి, ఆ మిశ్రమంలోకి కావాల్సినంత ఆరెంజ్ పౌడర్ కలపండి.ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి పట్టండి.

కనీసం ఓ ఇరవై నిమిషాలు ఉంచుకున్నాక కడిగేసుకోండి.ఇలా రోజు చేస్తే ఆయిల్ సమస్య తగ్గుముఖం పడుతుంది.

* నల్లటి మచ్చలు, నల్లటి వలయాలు .ఈ సమస్యలతో ఇబ్బందిపడేవారికి కూడా ఆరెంజ్ పౌడర్ ఉపయోగపడుతుంది.రెండు స్పూనుల ఆరెంజ్ పౌడర్ ని మిల్క్ క్రీమ్ లో కలపండి.ఈ మిశ్రమాన్ని వలయాలు ఉన్న చోట, నల్లటి లేదా తెల్లటి మచ్చలు ఉన్నచోట రోజు పెడుతూ ఉండండి.15 నిమిషాలు ఉంచుకొని కడిగేస్తే మంచిది.ఇదో అలవాటుగా చేసుకుంటే నల్లటి వలయాలు పోతాయి.

* వేసవిలో చర్మంపై దుమ్ముధూళి చేరడం చాలా సాధారణ విషయం.ముఖాన్ని సబ్బుతో కడిగే బదులు, ఆరెంజ్ పౌడర్ తేనే మిశ్రమంతో కడుక్కోవడం అలవాటుగా మార్చుకోండి.

ఇది మీ చర్మాన్ని బాగా క్లీన్ చేస్తుంది.

* మొటిమల బెడద ఉన్నా, స్కిన్ ట్యాన్ అవుతున్నా, పోర్స్ సమస్య, అధికచేమాట, స్కిన్ ఇన్ఫెక్షన్స్ .ఈ సమ్మర్ లో మీ చర్మ సమస్యలన్నిటికీ ఆరెంజ్ పౌడర్ పరిష్కారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube