కబాలి ముందున్న రికార్డులు ఇవే

సూపర్ స్టార్ రజినీకాంత్ మరికొన్ని గంటల్లో తన సత్తా చాటనున్నారు.బాక్సాఫీసు వద్ద కబాలి తుప్పుపట్టిన రికార్డుల దుమ్ము దులపనుంది.

 Opening Records That Kabali Is Looking To Break-TeluguStop.com

మొదటిరోజు ఎంత వస్తుందో ట్రేడ్ అంచనాలకి కూడా అందట్లేదు.అయితే ఓపెనింగ్స్ లో కబాలి ముందున్న రికార్డులేంటో ఓసారి చూద్దాం.

కబాలి బేసిక్ గా తమిళ సినిమా కాబట్టి, తమిళనాడులో ఈ చిత్రం 15.50 కోట్ల గ్రాస్ కొడితే రికార్డు అవుతుంది.ప్రస్తుతం ఆ రికార్డు అజిత్ నటించిన వేదాలం పేరిట ఉంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి రికార్డు చాలా దూరం కాని, డబ్బింగ్ సినిమాల్లో శంకర్ తీసిన, “ఐ” మొదటిరోజు 7.60 కోట్ల షేర్ రాబట్టింది తెలుగులో.ఈ రికార్డు రజినీ అందుకుంటాడా లేదా చూడాలి.

కర్ణాటకలో మొదటిరోజు రికార్డు కన్నడ సినిమాల పేరు మీద లేదు.బాహుబలి పేరు మీద ఉంది.బాహుబలి తొలిరోజు కర్ణాటకలో 6.60 కోట్లు కొల్లగొట్టింది.ఈ రికార్డుని కూడా రజినీ వేటాడాల్సిందే.ఇక కేరళలో కూడా అంతే.మొదటిరోజు రికార్డు తమిళ చిత్రం ఐ పేరిట ఉంది.మరి 3.16 కోట్లతో ఐ పేరు మీద ఉన్న రికార్డు కబాలి వశమవుతుందో లేదో చూడాలి.

ఇక టోటల్ ఇండియా తీసుకుంటే, 42 కోట్ల నెట్ తో బాహుబలి పేరిట ఓపెనింగ్ రికార్డు ఉంది.

వరల్డ్ వైడ్ గ్రాస్ తీసుకుంటే, దాదాపు 70 కోట్లతో సుల్తాన్ రికార్డు నెలకొల్పిపింది.ఈ రెండు రికార్డులను రజినీ స్టామినాని ఛాలెంజ్ చేసేవి.చూద్దాం … ఏం చేస్తాడో మన సూపర్ స్టార్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube