ఒక్క 'పేరా'తో వరించిన పదవి

ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకునేవారు తమ రెజ్యూమ్‌లో అనేక వివరాలు రాస్తారు.కొందరి రెజ్యూమ్ (సీవీ అని కూడా అంటారు) లు ఐదారు పేజీలు కూడా ఉంటాయి.

 One-para Cv Helped Gajendra Chauhan Become Ftii Chief-TeluguStop.com

తమ విద్యార్హతలు, ఇతర ప్రతిభాపాటవాల గురించి అప్లికేషన్‌లలో వివరిస్తారు.ఎక్కువ వివరాలతో అప్లికేషన్లు ఉంటే ఉద్యోగం వస్తుందని ఆవ పడతారు.

రెజ్యూమ్‌ ఒక్క పేజీకి పరిమితమైతే పట్టించుకోరనే అభిప్రాయం ఉంటుంది.అయితే రెజ్యూమ్‌లో ఒకే ఒక్క చిన్న పేరా రాసి గొప్ప పదవి సంపాదించుకున్న వ్యక్తి ఒకరు ఉన్నారు.

ఆయనే ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ గజేంద్ర చౌహాన్‌.ఈయన ఆ పదవికి తగినవాడు కాదని చాలామంది విమర్శిస్తున్న సంగతి తెలుసు.

తగిన అర్హతలు, ప్రతిభ లేకపోయినా ఆయనకు ఉన్నత పదవి కట్టబెట్టారని సినిమా ప్రముఖులు విమర్శిస్తున్నారు.కాని దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించడంలేదు.ఈ నేపథ్యంలో ఒకాయనకు గజేంద్ర చౌహాన్‌ తన రెజ్యూమ్‌లో ఏం రాశారోనని డౌటు వచ్చింది.‘ఆయన తన అప్లికేషన్‌లో ఏం రాశారో చెప్పండి’ అంటూ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నాడు.దీనికి ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌ వర్గాలు సమాధానం ఇచ్చాయి.గజేంద్ర చౌహాన్‌ తన రెజ్యూమ్లో ఒక్కటే ఒక్క పేరా రాశారు.దాని సారాంశం ఏమిటంటే…ఆయన మహాభారత్‌ టీవీ సీరియల్‌లో ధర్మరాజు పాత్ర పోషించాడు.నూటయాభై సినిమాల్లో, ఆరొందల టీవీ సీరియళ్లలో నటించాడు.

ఆయన తెలియచేసింది ఇంతే.దీనికే మురిసిపోయిన ప్రభుత్వం ఆయన్ని ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఛైర్మన్‌ను చేసింది.

ఈ పోస్టుకు ఇతరులు దాఖలు చేసుకున్న రెజ్యూమ్‌లు చాలా పెద్దగా ఉన్నాయి.ఒక్క చౌహాన్‌ అప్లికేషన్‌ మాత్రమే ఒక్క పేరాతో ఉంది.‘వడ్డించేవాడు మనవాడైతే బంతిలో చివర కూర్చునా ఫర్వాలేదు’ అనే సామెత మాదిరిగా అప్లికేషన్‌ ఒక్క పేరాతో ఉన్నా, ఒక్క లైన్‌తో ఉన్నా పోస్టు ఇచ్చేవారు మనవాడై ఉండాలి.చౌహాన్‌ విషయంలో అదే జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube