మణిరత్నం తాజాగా తెరకెక్కించిన ‘ఓకే బంగారం’ సినిమాకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తోంది.చాలా కాలం తర్వాత మణిరత్నం ఫామ్‌లోకి వచ్చాడు అంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.ఇప్పటికే ఈ సినిమా తమిళంలో దూసుకు పోతుంది.
‘ఓకే బంగారం’ తమిళంలో రాఘవ లారెన్స్ నటించి దర్శకత్వం వహించిన ‘కాంచన`2’ సినిమాతో గట్టి పోటీని ఎదుర్కొంటుంది.తమిళంలో ‘కాంచన`2’కు మంచి ఆధరణ లభిస్తోంది.
ఒకే రోజు విడుదలైన ‘ఓకే బంగారం’ మరియు ‘కాంచన`2’లు తమిళ బాక్సాఫీస్ వద్ద హోరీ హోరీ తలబడుతున్నాయి.‘ఓకే బంగారం’ క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, ‘కాంచన`2’కు మాత్రం మాస్ ప్రేక్షకుల నుండి విశేష ఆధరణ వస్తోంది.
తెలుగులో ‘కాంచన`2’ విడుదల కాకపోవడం ‘ఓకే బంగారం’ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యిందని చెప్పవచ్చు.వారం ముందు వచ్చిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా కలెక్షన్స్ తగ్గు ముఖం పట్టడంతో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ఓకే బంగారం’ తిరుగు లేకుండా ఆడుతోంది.
ముఖ్యంగా క్లాస్ సెంటర్స్‌లో మంచి వసూళ్లను సాధిస్తోంది.కాని తమిళంలో మాత్రం ‘కాంచన`2’ ధాటికి కాస్త వెనుక పడి పోయిందని చెప్పాలి.