ట్యాక్సి డ్రైవర్ ని రేప్ చేసి డబ్బులు లాక్కున్న అమ్మాయి

అమెరికా యువతని పట్టుపీడిస్తున్న పెనుభూతాలు రెండు .ఒకటి సెక్స్ అడిక్షన్ రెండు డ్రగ్ అడిక్షన్.

 Ohio Woman Arrested For Raping A Taxi Driver At Knifepoint-TeluguStop.com

ఈ అవసరాలు తీర్చుకోవడం కోసమే అక్కడి యువత తప్పుదోవలు పడుతోంది.తాజాగా ఓ పురుష డ్రైవర్ ని రేప్ చేసిన ఓ అమ్మాయిని పోలీసులు అరెస్టు చేసారు.

నమ్మడానికి కష్టంగా ఉన్నా మీరు విన్నది నిజమే.ఓ అమ్మాయి ఓ డ్రైవర్ అతని కారులోనే రేప్ చేసింది.

అప్పుడు ఆ డ్రైవర్ తప్పించుకోవడానికి ప్రయత్నించలేదా అని అనుమానపడొచ్చు.అక్కడే ట్విస్ట్‌ ఉంది.

వివరాల్లోకి వెళితే జనవరి 28, 2017వ తేదిన బ్రిటన్ని కార్టర్ అనే అమ్మాయి ఉదయాన్నే ఓ హోటల్ నుంచి బయటికోస్తూ ఉదయం 4:28 ప్రాంతంలో ఓ ట్యాక్సిని ఆపింది.ఆమెతో పాటు కొరే జాక్సన్ అనే 20 ఏళ్ళ కుర్రాడు, మరో గుర్తు తెలియని వ్యక్తి కూర్చున్నారు.

కారు కదిలిన కాసేపటికే కోరే జాక్సన్ కత్తి తీసి డ్రైవర్ మెడకి గురిపెట్టాడు.

ఆ 23 ఏళ్ళ అమ్మాయి ఊహించనివిధంగా తనతో సెక్స్ చేయమని లేదంటే చంపేస్తామని డ్రైవర్ ని బెదిరించటం మొదలుపెట్టింది.

మొత్తానికి బలవంతంగా అతనిపై లైంగిక దాడులు చేసిందట.ఆ తరువాత సెక్స్ చేసి, అక్కడితో ఆగకుండా అతని జేబులో ఉన్న $32 డాలర్లు లాక్కొని ఆ ముగ్గురు పరుగులు తీసారు.

ఇప్పుడు, రెండున్నర నెలలు గడిచాక ఆ అమ్మాయి పోలీసులకి చిక్కింది.తనపై ఫస్ట్ డిగ్రీ రేప్ కేసు బుక్ చేసారు.

ఇక కత్తితో బెదిరించిన కోరే జాక్సన్, ఆ అమ్మాయి మరో స్నేహితుడు ఇంకా పరారీలోనే ఉన్నారు.పోలీసుల దర్యాప్తులో తేలిన విషయం ఏమిటంటే, ఆ అమ్మాయి ఒక డ్రగ్ అడిక్ట్.

ఇంతకుముందు తనని డ్రగ్స్ కేసులో రెండుసార్లు పోలీసులు పట్టుకున్నారట.డ్రగ్స్ కొనడానికి డబ్బుల కోసం, సెక్స్ అడిక్షన్ లో భాగంగా ఆ పూట కోరిక తీర్చుకోవడానికి ఇలా చేసి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

ఇక తనకి సహయం చేసి కత్తితో భయపెట్టిన జాక్సన్ మీద మర్డర్ అటెంప్ట్, దోపిడి కేసులు వేసారు పోలీసులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube