నాన్నకు ప్రేమతోకి మళ్ళీ అడ్డంకులు

ఎప్పటినుంచైతే నాన్నకు ప్రేమతో సంక్రాంతికి వస్తున్నట్లు ప్రకటించారో, అప్పటి నుంచి ఆ చిత్రానికి అన్ని అడ్డంకులు.ఒక రాజకీయ వర్గం, అడుగడుగునా ఎన్టీఆర్ సినిమాకి ఆటంకాలు సృష్టిస్తోనే ఉంది.

 Obstacles For Nannaku Prematho Censor-TeluguStop.com

మొన్నామధ్య పంపిణిదారులను బెదిరించి సినిమాను కొనకుండా చాలా కాలం ఆపారు.ఆ ఎత్తుగడ ఫలించలేదు.

రిలియన్స్ అండతో సీడేడ్ ఏరియాలో విడుదల అవుతోంది నాన్నకు ప్రేమతో.

ఆ తరువాత విడుదల తేది వాయిదా పడేలా చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసారు.

ఈసారి ఏకంగా నిర్మాతపై దండెత్తారు.చేతులెత్తేసిన నిర్మాతలో స్వయంగా ఎన్టీఆర్ ధైర్యం నింపాడు.

పరిస్థితులు అనుకూలించకపొయినా, తన బలంతో నాన్నకు ప్రేమతో వాయిదా పడకుండా చూసుకున్నాడు.

ఇప్పుడు నాన్నకు ప్రేమతో సెన్సార్ లో ఆలస్యం జరిగేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట.

సెన్సార్ అవకముందే తెలుగు రాష్ట్రాల్లో అడ్వాస్స్ బుకింగ్ మొదలు కాదు.విడుదల తేదిపై యూనిట్ కూడా ఒక తేదికి ఫిక్స్ అవలేదు.

అందుకే ఈ రకంగా చిత్రాన్ని దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారు.రఫ్ కాపి సిద్ధమైతే అయ్యింది.

ఇక సెన్సార్ బొర్డు స్క్రీనింగ్ కి అనుమతి ఎప్పుడు ఇస్తుందో చూడాలి.అంత సవ్యంగా జరిగి నాన్నకు ప్రేమతో జనవరి 13నే విడుదల అయితే మాత్రం అది ఖచ్చితంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ గొప్పతనమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube