వీర్యం ఉత్పత్తిని పెంచుకునే ఈజీ మార్గం

స్నాక్స్ అనగానే బజ్జిలు, వడలు అంటూ ఉన్న కొవ్వు సరిపోనట్టు రకరకాల ఆయిలీ ఫుడ్ తింటూ ఉంటారు.సాయంత్రాల్లో జంక్ ఫుడ్ కూడా హెవీగా తినటం చూస్తుంటాం.

 Nuts And Dry Fruits Will Benefit Sperm Production-TeluguStop.com

బయటకి వెళ్లి, పానిపూరి అంటు, పిజ్జా, బర్గర్ అంటూ ఎక్కడలేని చెత్తంతా శరీరంలోకి చేరుస్తూ ఉంటారు.వీటి బదులు స్నాక్ లోకి డ్రై ఫ్రూట్స్, నట్స్ తినటం ఎంతో మేలు.

మరి ముఖ్యంగా పురుషులకి ఇవి చాలా అవసరం.

అబ్బాయిలు స్నాక్స్ టైమ్ లో నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే వీర్యం బలపడుతుందని ఇటివలే పలు పరిశోధనలు తేల్చిచెప్పాయి.

ఎందుకంటే నట్స్ లో పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ను ఉంటాయి.ఇవి వీర్యకణాల ఉత్పత్తిని బాగా పెంచుతాయి.

పీనట్స్ లో జింక్ పుష్కలంగా ఉంటుంది.అరోగ్యానికి ఇతర విషయాల్లో సహాయం చేయడంతో పాటు, జింక్ వీర్యకణాల్ని బలపరుచుతుంది.

బాదం మరియు వాల్ నట్స్ లో అమినోయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.దీన్ని ఆర్జినైన్ అని అంటారు.

ఇవి కూడా వీర్యకణాల ఉత్పత్తిని పెంచుతాయి.

కాబట్టి ఆయిలి ఫుడ్, జంక్ ఫుడ్ మీద సాయంత్రాల్లో పెట్టే ఖర్చు కాస్త నట్స్ కొనడంలో పెడితే బాగుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube