ఎన్టీఆర్ కాదన్న కథ బ్లాక్బస్టర్, ఒప్పుకున్న దానికి నష్టాలు

జనతా గ్యారేజ్ తరువాత ఓ రెండు మూడు నెలలపాటు సినిమాలేమి ఒప్పుకోలేదు ఎన్టీఆర్.గ్యాప్ వచ్చిన ఫర్వాలేదు, కాని జనతా గ్యారేజ్ తెచ్చిన ఊపు మళ్ళీ చల్లారకూడదు.

 Ntr’s Rejected Story Turns Blockbuster-TeluguStop.com

పునర్వైభవం పొందేయ్యాలి, ఇదే ఎన్టీఆర్ ప్లాన్.ఆ మార్కేట్ ని పోగొట్టుకూడదనే తేలిగ్గా ఏ సినిమా ఒప్పుకోలేదు.

తనకి టెంపర్ లాంటి కెరీర్ చేంజింగ్ సినిమా ఇచ్చిన పూరి జగన్నాథ్ ని కూడా కాదన్నాడు.ఆ సినిమా కథ రాసిన వక్కంతం వంశీ కొన్నేళ్ళుగా డైరెక్షన్ ఛాన్స్ అంటూ తిరుగుతున్నాడు.

అతని కథ కూడా విని కదన్నాడు.పటాస్, సుప్రీమ్ లాంటి సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించి సూపర్ ఫామ్ లో అనీల్ రావిపూడి తీసుకొచ్చిన కథను కూడా రిజెక్ట్ చేసాడు.

అటు తిరిగి, ఇటు తిరిగి, చివరకి బాబి సినిమా ఓకే చేసాడు.అదే “జైలవకుశ”.

ఇక కాదన్న అనీల్ రావిపూడి సినిమా ” రాజా ది గ్రేట్”

కాని చిత్రం చూడండి, ఎన్టీఆర్ కాదన్న రాజా ది గ్రేట్ సూపర్ హిట్ స్టేటస్ వైపు అడుగులు వేస్తోంది.రవితేజ మార్కేట్ కి తగ్గట్టుగా భారీ వసూళ్ళు సాధిస్తోంది.

బయ్యర్లకు లాభాలు తెచ్చిపెట్టేలా ఉంది.మరోవైపు ఎన్టీఆర్ ఏరికోరి ఎంచుకున్న కథ “జైలవకుశ” పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా, ఎందుకో అనుకున్నంతగా ఆడలేదు.

ఈ సినిమా బిజినెస్ కూడా ఇక ముగిసినట్లే.చేదువార్త ఏమిటంటే, పంపిణిదారులకు ఈ సినిమా వలన నష్టాలే తప్ప, లాభాలైతే లేవు.

వద్దన్న కథకి ఏమో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.కావాలుకున్న కథ ఏమో నష్టాలు తీసుకొచ్చింది.సినిమా ప్రపంచం అంటేనే ఇంత.ఏది మన ఊహకు అందదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube