మళ్ళీ ఎన్టీఆర్ ని మొత్తం మార్చేస్తారట

లూక్స్ గురించి మాట్లాడుకుంటే, ఎన్టీఆర్ కెరీర్ ని టెంపర్ కి ముందు టెంపర్ తరువాత అని విభజించవచ్చు.సిక్స్ ప్యాక్ బాడి చేయించి, హెయిర్ స్టయిల్ పూర్తిగా మార్చేసి, ఎన్టీఆర్ కనబడే తీరు పూర్తిగా మార్చేసారు దర్శకుడు పూరి జగన్నాథ్.

 Ntr To Undergo Another Makeover For Film With Bobby-TeluguStop.com

ఇక నాన్నకు ప్రేమతో సంగతి సరేసరి.అసలు కనబడుతున్నది ఇన్నిరోజులు చూసిన ఎన్టీఆర్ ఏనా కాదా అన్నట్టుగా, లుక్ ని అమాంతం కొత్త కోణంలో చూపించారు సుకుమార్.

ఆ సినిమాలో ఎన్టీఆర్ స్టయిల్ ని ఫాలో అయిన అబ్బాయిలు ఎంతమందో !

జనతా గ్యారేజ్ కోసం కొరటాల శివ మరీ ఎక్కువ మార్పులు చేయకుండా, సింపుల్ గా ఉంచేశారు.కాని ఇప్పుడు బాబితో తీయబోతున్న సినిమాలో ఎన్టీఆర్ మరోసారి పూర్తిగా కొత్తగా కనబడబోతున్నాడట.

ఎన్టీఆర్ లుక్ మరోసారి కొత్తరకంగా మార్చేందుకు ఇప్పటికే కొంతమంది స్టయిలిస్టులను పిలిపించాడటా బాబి.ఎన్టీఆర్ కొత్త లుక్ మీద అప్పుడే కసరత్తులు మొదలయ్యాయి.

కళ్యాణ్ రామ్ నిర్మించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం అవుతుంది.హీరోయిన్ ఎవరు, సంగీతం ఎవరిదీ ఇతరాత్ర వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube