బిగ్ బాస్... ఒక్కో ఎపిసోడ్‌కు ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ ఇదే

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్‌గ బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌వుతోన్న షో బిగ్ బాస్‌.ఎన్టీఆర్ ఈ షోకు హోస్ట్‌గా చేస్తున్నాడ‌న్న వార్త‌లు, టీజ‌ర్లు, ట్రైల‌ర్లు బ‌య‌ట‌కు రాగానే తెలుగు బుల్లితెర వీక్ష‌కుల్లో ఎక్క‌డా లేని రెస్పాన్స్ వ‌చ్చింది.

 Ntr Remuneration For Bigg Boss Show-TeluguStop.com

దీనిపై మీడియా, సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో న్యూస్ ట్రెండ్ అవుతూనే ఉంది.ఎన్టీఆర్ బిగ్ బాస్ షో హోస్ట్ అన్న ఒక్క వార్త టోట‌ల్‌గా తెలుగు మీడియాను షేక్ చేసి ప‌డేస్తోంది.

ఇక తెలుగు బుల్లితెర మీద అత్యంత కాస్ట్ లీ షోగా చ‌ర్చ‌ల్లో ఉన్న ఈ షోలో ఒక్కో ఎపిసోడ్‌కు గాను ఎన్టీఆర్ భారీ రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడ‌ని తెలుస్తోంది.ఎన్టీఆర్‌కు ఎపిసోడ్‌కు రూ.35 లక్షలు చెల్లిస్తోందట సదరు చానల్ యాజమాన్యం.ఇది తెలుగు బుల్లితెర చ‌రిత్ర‌లోనే చాలా హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్‌.

గ‌తంలో ఇదే మా టీవీలో ప్ర‌సార‌మైన మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోలో హోస్ట‌ర్లుగా ఉన్న చిరంజీవి, నాగార్జున‌కు కూడా ఈ రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ ఇవ్వ‌లేద‌ట‌.ఇక ఈ షోకు క్రేజ్ రావడానికి ప్రధాన కారణం జూనియర్ ఎన్టీఆర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అయితే ఈ షోలో ఉన్న కంటెస్టెంట్లు చాలా వీక్ అన్న టాక్ రావ‌డంతో షోకు అనుకున్న రేంజ్‌లో రెస్పాన్స్ రావ‌డం లేదు.కేవ‌లం ఎన్టీఆర్ ఉన్న ఎపిసోడ్ల‌కు మిన‌హా మిగిలిన ఎపిసోడ్ల‌కు అనుకున్న రేంజ్‌లో టీఆర్పీ రేటింగ్స్ రాక‌పోవ‌డంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా టాప్ సెల‌బ్రిటీల‌ను బిగ్ బాస్‌లో ప్ర‌వేశ‌పెట్టేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube