ఎన్టీఆర్ తదుపరి సినిమా దర్శకుడు ఇతనేనా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి సినిమా ఎవరితో? ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఇదే చర్చ.జనతా గ్యారేజ్ లాంటి భారి సక్సెస్ తరువాత ఎన్టీఆర్ ని డైరెక్ట్ చేసే అదృష్టం ఎవరికి దొరుకుతుంది అనేది ఇంకా సస్పెన్స్ గానే కొనసాగుతోంది.

 Ntr – Chandoo Mondeti Film On Cards-TeluguStop.com

వక్కంతం, అనీల్ రావిపూడి ఎలాగో ఇప్పుడు లైన్ లో లేరు.త్రివిక్రమ్ పవన్ తో చేసిన తరవాత ఖచ్చితంగా చేస్తానని మాటిచ్చేసారట.

ఇక మిగిలున్న పూరి జగన్నాథ్ కి ఛాన్స్ రావడం కష్టమే అని అంటున్నారు.

ఇప్పుడు కొత్తగా ఎవరు ఊహించని పేరు వినబడుతోంది.

అతనెవరో కాదు, ప్రేమమ్ తో మంచి హిట్ కొట్టిన చందూ మొండేటి.అవును, చందూ ఇటివలే ఎన్టీఆర్ ని కలిసి ఒక ఆసక్తికరమైన కథ చెప్పాడని, ఆ పాయింట్ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ వార్తలో నిజం ఎంతవరకు ఉందో తెలియదు కాని, ఈ కాంబినేషన్ నిజంగానే కార్యరూపం దాల్చితే చూడ్డానికి ఆసక్తికరంగానే ఉంటుంది.చందూ క్లాస్, ఎన్టీఆర్ మాస్ కలగలిస్తే ఎలాంటి సినిమా బయటకి వస్తుందో మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube