దండయాత్ర కాదట

ఎన్టీఆర్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమా అతి త్వరలో సెట్స్‌ పైకి వెళ్లబోతుంది.స్పెయిన్‌లో ఈ సినిమా షూటింగ్‌ కార్యక్రమాలను ప్రారంభించబోతున్నట్లుగా ఇటీవలే దర్శకుడు సుకుమార్‌ ప్రకటించాడు.

 “nannaku Prematho” Title For Ntr-sukumar Movie-TeluguStop.com

ఇక ఈ సినిమాకు ‘దండయాత్ర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి.‘టెంపర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌ చెప్పిన డైలాగ్‌.

ఇది దయాగాడి దండయాత్ర బాగా ఫేమస్‌ అవ్వడంతో ఈ టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని నిర్ణయించినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం వచ్చింది.కాని తాజాగా ఈ సినిమా టైటిల్‌ అంటూ మరో కొత్త పేరు ప్రచారం అవుతోంది.

తండ్రి, కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్‌ను దర్శకుడు సుకుమార్‌ పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.అయితే ఈ టైటిల్‌కు ఎన్టీఆర్‌ ఓకే చెప్పడం అనుమానమే అంటున్నారు ఆయన సన్నిహితులు.

సినిమా టైటిల్‌ అంత క్లాస్‌గా ఉంటే నెగటివ్‌ టాక్‌ వస్తుందని ఎన్టీఆర్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.నందమూరి ఫ్యాన్స్‌కు కూడా ఈ టైటిల్‌ పెద్దగా నచ్చడం లేదు.

ఫ్యాన్స్‌ ఎక్కువగా ‘దండయాత్ర’ టైటిల్‌ను కోరుకుంటున్నారు.లేదా మరేదైనా మాస్‌ టైటిల్‌ను పెట్టాలని సుకుమార్‌ను డిమాండ్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube