అప్పటికి ఎన్టీఆర్ ఇంకా నాన్నకు ప్రేమతో మొదలుపెట్టలేదు.ఎన్టీఆర్ – బి.
వి.ఎస్.ఎన్ ప్రసాద్ సినిమా చర్చల దశలో ఉండగా శ్రీకాంత్ అడ్డాల వెళ్ళి ఎన్టీఆర్ కి ఒక కథ వినిపించాడు.నిర్మాతకి నచ్చింది.
ప్రొడ్యూస్ చేద్దాం అని డిసైడ్ అయిపోయారు కూడా.కాని ఎందుకో ఎన్టీఆర్ కే కథ నచ్చలేదు.
దాంతో హీరో – నిర్మాత కాంబినేషన్లో, సుకుమార్ దర్శకుడిగా “నాన్నకు ప్రేమతో” తెరకెక్కింది.కట్ చేస్తే ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది.
అదే కథకి ఎక్కడికి అక్కడే మార్పులు చేసి, దాన్ని మరో కోణంలో రాసి, తనతో అప్పటికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు చిత్రాన్ని చేసిన మహేష్ కి వినిపించాడు అడ్డాల.మహేష్ కథ నచ్చింది.
సినిమా ఒప్పుకున్నాడు, పివిపితో కలిసి పూర్తి చేసాడు.కట్ చేస్తే, మహేష్ కెరీర్లో అతిపెద్ద ఫ్లాప్ అయ్యే సినిమా అవబోతోంది బ్రహ్మోత్సవం.
ఎన్టీఆర్ బతికిపోతే, మహేష్ ఇరుక్కుపోయాడు.ఒకరకిి అదృష్టం మరొకరికి దురదృష్టం.
సినిమా రంగం అంతే, మన జయానికి, అపజయానికి మన సొంత నిర్ణయాలే కారణం.