యంగ్ టైగర్ ఇక చుక్కలు చూపిస్తాడు

యంగ్ టైగర్ ఈజ్ బ్యాక్ … అంత అనుకున్నట్టుగా జరిగి, టాక్ బాగా వచ్చేస్తే సెప్టెంబరు 1వ తేది సాయంత్రం అందరి నోట ఇదే మాట ఉంటుంది.చాలాకాలంగా అభిమానులకి బాకీ పడ్డ ఎన్టీఆర్‌ ఈసారి రికార్డుల దుమ్ము దులపడం ఖాయంగా కనిపిస్తోంది.

 Huge Day 1 On Cards For Janatha Garage-TeluguStop.com

ఆది, సింహాద్రి కాలంనాటి ఎన్టీఆర్ మళ్ళీ కనబడతాడని ఫిలింనగర్ జనాలు అప్పుడే ఒక అంచనాకి వచ్చేస్తున్నారు.

ఇక జనతా గ్యారేజ్ బిజినెస్ గురించి మాట్లాడితే, అమెరికా ప్రిమియర్స్ యొక్క టికేట్ ధర $20 డాలర్లుగా నిర్ణియించారు.

ఆస్ట్రేలియాలో ప్లాన్ చేసిన ప్రిమియర్ షోలకి మంచి రెస్పాన్స్ వస్తోంది.ఇక ఎన్టీఆర్ అడ్డాగా చెప్పుకునే సీడెడ్ లో విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటికే అక్కడ కొన్ని బెనిఫిట్ షోల టికెట్స్‌ పూర్తిగా అమ్ముడుపోయాయని టాక్.

నైజాంలో కూడా బెనిఫిట్ పడనున్నాయని సమాచారం.

ఇప్పటికే హైదరాబాద్ విశ్వనాథ్ థియేటర్లో బెనిఫిట్ షోకి పర్మిషన్ దొరికింది.విజయవాడ లో తొలిరోజు 125/135 మల్టిప్లెక్స్ షోలు జనతా గ్యారేజ్ కి దొరికాయి.

ఇలా అన్ని ప్రాంతాల్లో తన స్టార్ పవర్ చూపిస్తున్నాడు యంగ్ టైగర్‌.

మొత్తం మీద మాట్లాడుకుంటే .బాహుబలి మొదటిరోజు రికార్డు చాలాదూరం కాని, శ్రీమంతుడు మొదటిరోజు కలెక్షన్లు అవలీలగా దాటే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక సర్దార్ గబ్బర్ సింగ్ దగ్గరిదాకా వస్తుందా, లేదంటే దాటేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube